Jabardasth Priyanka comments: జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేసే సాయి తేజ కాస్తా బిగ్ బాస్ షోలో ప్రియాంక సింగ్ గా దర్శనం ఇచ్చాడు. మరింత పాపులారిటీ పెంచుకున్నాడు. తన జెండర్ ని పేరెంట్స్ కి తెలియకుండా మార్చుకున్నాను అన్న ప్రియాంక సింగ్, లేటెస్ట్ ఇంటర్వ్యూలో నాగబాబు(NAGABABU), నిహారికలను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేసింది.
Also Read: టాలీవుడ్ యంగ్ హీరో తో డేటింగ్ లో సానియా మీర్జా..ఎవరా యంగ్ హీరో?
జబర్దస్త్(JABARDASTH) కామెడీ షోలో పలువురు అబ్బాయిలు లేడీ గెటప్స్ వేసేవారు. వారిలో సాయి తేజ ఒకడు. నాలుగైదేళ్లు జబర్దస్త్ కమెడియన్ గా సాయి తేజ కొనసాగాడు. లేడీ గెటప్స్ వేస్తూ పాపులర్ అయ్యాడు. అచ్చు అమ్మాయిలా ఉండే సాయి తేజ సదరు పాత్రల్లో ఒదిగిపోయేవాడు. కారణం తెలియదు కానీ సాయి తేజ జబర్దస్త్ కి దూరమయ్యాడు. జబర్దస్త్ షోలో లేడీ గెటప్స్ వేయడం మానేశాడు. బుల్లితెరకు దూరమైన సాయి తేజ కొన్నేళ్ల తర్వాత బిగ్ బాస్ హౌస్లో దర్శనం ఇచ్చాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో సాయి తేజ కంటెస్ట్ చేశాడు. ప్రియాంక సింగ్ గా తనని తాను కొత్తగా పరిచయం చేసుకున్నాడు.
ఇక బిగ్ బాస్(BIGG BOSS) షో వేదికగా తాను జెండర్ మార్చుకున్నట్లు సాయి తేజ ప్రకటించాడు. సాయి తేజ కాస్తా ప్రియాంక సింగ్(PRIYANKA SINGH) అయ్యింది. ఈ విషయం వెల్లడిస్తూ ఎమోషనల్ అయిన ప్రియాంక సింగ్.. తండ్రికి క్షమాపణలు చెప్పింది. బిగ్ బాస్ హౌస్లో ప్రియాంక సింగ్ బాగానే రాణించింది. ప్రియాంక సింగ్ 13 వారాలు హౌస్లో ఉండటం విశేషం. ఈమె హౌస్లో ఒక ప్రేమ కథ నడిపింది. నటుడు మానస్ అంటే ప్రియాంక అమితమైన ప్రేమ చూపించేది. అతడికి సేవలు చేయడానికి ఇష్టపడేది.
హౌస్లో ఉన్న ప్రతి అబ్బాయి నాకు బ్రదర్ తో సమానం, ఒక్క మానస్ తప్ప అని ఓపెన్ కామెంట్స్ చేసింది. మానస్ మాత్రం ఒక లైన్ మైంటైన్ చేశాడు. అతడు పూర్తిగా ప్రియాంక సింగ్ కి దగ్గర కాలేదు. అలా అని దూరం పెట్టలేదు. ప్రియాంక సింగ్ తో సన్నిహితంగా ఉన్నాడు. వీరిద్దరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు. ప్రియాంక సింగ్ దాదాపు పాజిటివ్ ఇమేజ్ తో బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చింది. మానస్ తో ప్రేమాయణం తప్ప, ఆమెపై పెద్దగా కంప్లైంట్స్ లేవు. అమ్మాయిలకు మించి అందంగానే ఉండే ప్రియాంక, చాలా చక్కగా రెడీ అయ్యేది.
Also Read: పూరి జగన్నాథ్ అసిస్టెంట్ గా రాజమౌళి.. కారణమేంటి..?
తాజాగా ప్రియాంక ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలో ఒకప్పటి జబర్దస్త్ జడ్జి నాగబాబును ఉద్దేశించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. జబర్దస్త్ షోలో ఉన్నప్పుడు నాగబాబు చాలా ప్రోత్సహించారని ప్రియాంక సింగ్ ఎమోషనల్ అయ్యింది. నా పని నేను చూసుకునేదాన్ని. నాపై ఎలాంటి ఆరోపణలు లేవు. అది ఆయనకు నచ్చింది. సొంత కూతురిలా నన్ను ఆదరించారు. నేను రియాలిటీ షోలో ఉన్నప్పుడు కూడా ఓట్లు వేయాలని ఆయన సపోర్ట్ చేశారు. నిహారికతో కూడా నాకు అనుబంధం ఉంది. ఆమె బంగారం. ఈ మధ్య వారితో మాట్లాడటం లేదు. వారు బిజీ కాబట్టి. నాగబాబు, నిహారికలతో మాట్లాడినా మాట్లాడకపోయినా మా అనుబంధం అలానే ఉంటుంది… అంటూ ప్రియాంక కన్నీరు పెట్టుకుంది.