Jabardasth Praveen: జబర్దస్త్ ఎంత మందికి లైఫ్ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షోలో వచ్చే జంటలు మరింత ఫేమస్ అవుతుంటాయి. అందులో ముఖ్యంగా జబర్దస్త్ ఫైమా, ప్రవీణ్ ల జంట ఒకటి. ఈ జంట కూడా జబర్దస్త్ ద్వారానే మంచి ఆదరణ పొందింది. సపరేట్ గా కన్నా ఇద్దరికి కలిపి ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే అన్ని జంటలు నిజం కాదు. కొన్ని షోల కోసం మాత్రమే జంటలుగా నటిస్తే.. కొందరు మాత్రం రియల్ లైఫ్ లో కూడా జోడీగా ఉంటారు. మరికొందరు షో ద్వారా జంటలుగా మారి ఆ తర్వాత కూడా జోడీగానే ఉండాలని అనుకుంటారు. అయితే ప్రవీణ్ కూడా అదే విధంగా ఫైమాపై ప్రేమ పెంచుకున్నారు. మరి ఫైమా ఏంచేసిందో తెలుసుకుందాం…
రీసెంట్ గా ప్రవీణ్ ఓ ఇంటర్వ్యూలో ఫైమా గురించి, తన పర్సనల్ లైఫ్ గురించి సంచలన విషయాలు వెల్లడించారు. ఫైమాతో ప్రేమ స్నేహంతో మొదలైందని.. తన కెరీర్ ఆరంభం నుంచే ఫైమా తనతో ఉందన్నారు ప్రవీణ్. అందుకే ఆమెపై ఇష్టం పెంచుకున్నాడట. కానీ ఫైమా మాత్రం తన ప్రేమను రిజెక్ట్ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు తనకు నచ్చింది, ప్రేమించాను అదే విషయం ఫైమాకు చెప్పానని.. కానీ తన నిర్ణయం తనదని తెలిపారు ప్రవీణ్. నో చెప్పిందనే కారణంతో ఫైమాకు దూరంగా ఉండలేనని.. వారి మధ్య ప్రేమ లేకపోయినా స్నేహం ఉందని.. అదే విషయం ఫైమాతో కూడా చెప్పానని తెలిపారు.
ఒక మంచి స్నేహితునిగా వెంట ఎప్పటికీ ఉంటానని..కానీ తన ప్రేమను అంగీకరించకపోవడంతో కొన్ని సందర్భాలలో చాలా ఏడ్చాను అని తెలిపారు ప్రవీణ్. అయినా ఫస్ట్ లవ్ ఈజ్ బెస్ట్ లవ్, కానీ ఆమె ఒప్పుకోకపోవడంతో బాధ పడ్డాను. కానీ తర్వాత అర్థం చేసుకున్నాను అని వెల్లడించారు.
ప్రస్తుతం తన కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని.. తన తండ్రి చనిపోయిన తర్వాత అప్పుల గురించి తెలిసిందని.. వాటిని తీర్చే బాధ్యతను తీసుకున్నాను కాబట్టి బిజీ అయ్యాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ప్రవీణ్. అంతే కాదు ఒకవేళ ఫైమా తన ప్రేమను అంగీకరిస్తే సంతోషంగా స్వీకరిస్తానని ప్రవీణ్ తెలపడంతో ఈ కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి.