Chandrababu Arrest : చంద్రబాబు అంటే.. అన్నీ చేయగల మాయలోడు అని ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. 45 ఏళ్లుగా వ్యవస్థలను మెయింటేన్ చేసిన ఘనుడు బాబులోరు.. అలాంటి చంద్రబాబు తానే అన్నీ చేశానని గొప్పలకు పోతాడు.. హైదరాబాద్ కట్టించింది నేనే.. సత్య నాదెళ్లకు కంప్యూటర్ నేర్చుకోమన్నది నేనే.. రాష్ట్రపతులను, ప్రధానులను ఎంపిక చేసింది నేనే అంటూ గొప్పలు చెబుతుంటారు.
చంద్రబాబు మాత్రమే కాదు.. ఆయన అభిమానులు కూడా అలానే తయారయ్యారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నందమూరి వశం కాకుండా నారా బ్రహ్మాణికి ఇష్టం లేకున్నా కూడా చంద్రబాబే ముందుట పడి బాలయ్యను ఒప్పించి ఎదురుకట్నం ఇచ్చి మరీ లోకేష్ తో పెళ్లి చేశాడని ఓ టాక్ ఉంది. ఇప్పుడు చంద్రబాబు వచ్చాక అందరు అమ్మాయిలకు ఎదురుకట్నం ఇచ్చే స్థాయికి చేర్చాడని ఓ మహానటి ఇటీవల గచ్చిబౌలిలో నిర్వహించిన చంద్రబాబు పశ్చాత్తాప సభలో బోరుమన్నది.
ఒకప్పుడు కట్నం ఇచ్చేవాళ్లమని.. ఇప్పుడు అమ్మాయిలకు ఎదురుకట్నం ఇచ్చేవాళ్లలాగా చేసిన ఘనత చంద్రబాబుదేనని ఓ తెలుగు మహిళ నినదించింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ కాగానే నెటిజన్లు ఊరుకుంటారా? ‘జంబలకిడి పంబ సినిమాలోని సీన్లను కలిపి కొట్టి ట్రోల్స్ చేస్తున్నారు.
ఆఖరుకు అమ్మాయిలకు ఎదురుకట్నం ఇచ్చే ఘనత కూడా చంద్రబాబు ఖాతాలోనే వేశారా? అని అందరూ సెటైర్లు వేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎంతైనా మా బాబు గారు గ్రేట్ అని కొందరు మాత్రం ముసి ముసి నవ్వులు నవ్వుతున్నారు.
పపుగాడి పెళ్ళికి ఎదురు కట్నం ఇవ్వాల్సివచ్చింది కనుక.. అందరూ అలానే ఇస్తున్నారని బలంగా ఫీలవుతున్న పచ్చ బ్యాచ్ pic.twitter.com/652ehJNh1e
— Inturi Ravi Kiran (@InturiKiran7) October 30, 2023