Jabardasth Praveen Marriage: జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ పెళ్లి చేసుకున్నాడు. ప్రవీణ్ పెళ్లి ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రవీణ్ వేరే అమ్మాయిని వివాహం చేసుకున్న తరుణంలో ఫైమా పరిస్థితి ఏంటని జనాలు వాపోతున్నారు. ఫైమా-ప్రవీణ్ ఒకరినొకరు ఇష్టపడుతున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ షో వేదికగా కూడా ప్రవీణ్ పై ఇష్టాన్ని ఫైమా బయటపెట్టింది. కష్ట సమయాల్లో తనను ఆదుకున్న ఒకే ఒక వ్యక్తి ప్రవీణ్ అని ఫైమా వెల్లడించింది. ఫైమా-ప్రవీణ్ రిలేషన్ లో ఉన్నారు. ఇద్దరూ మ్యారేజ్ చేస్తుకుంటారనుకున్న తరుణంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.
ప్రవీణ్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అతడు పెళ్లి వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. ఫైమా లవర్ ప్రవీణ్ వేరే అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. నెటిజెన్స్ సోషల్ మీడియాలో ప్రవీణ్ మీద ప్రశ్నల వర్షం కురిపించారు. దాంతో అసలు విషయం బయటపెట్టాడు. ఇది నిజమైన పెళ్లి కాదు. కేవలం ఓ యూట్యూబ్ ఛానల్ కోసం జరిగిన ఉత్తుత్తి మ్యారేజ్ అని క్లారిటీ ఇచ్చాడు. మరో జబర్దస్త్ కమెడియన్ కొమరం యూట్యూబ్ ఛానల్ ఈ మ్యారేజ్ వీడియో రూపొందించినట్లు తెలియజేశాడు.
దాంతో ప్రవీణ్ నిజంగా వివాహం చేసుకోలేదని స్పష్టత వచ్చింది. ప్రవీణ్ పటాస్ షోతో పాపులర్ అయ్యాడు. పలు కామెడీ షోలలో పని చేశాడు. కొన్నాళ్లుగా జబర్దస్త్ లో కొనసాగుతున్నాడు. ఇటీవల ప్రవీణ్ టీమ్ లీడర్ కూడా అయ్యాడు. జబర్దస్త్ నుండి సీనియర్స్ అందరూ వెళ్ళిపోయిన తరుణంలో ప్రవీణ్ కి టీమ్ లీడర్ గా అవకాశం వచ్చింది. ప్రవీణ్ కెరీర్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది.
మరోవైపు ఫైమా జోరు మామూలుగా లేదు. బిగ్ బాస్ షోలో ఫైమా అదరగొట్టింది. అంచనాలకు మించి రాణించింది. చదువుకోని ఫైమా ఎక్కువ రోజులు హౌస్లో ఉండదని అందరూ భావించారు. అనూహ్యంగా చివరి వరకు కొనసాగింది. ఫైనల్ కి ముందు ఫైమా ఎలిమినేట్ అయ్యింది. బిగ్ బాస్ షో ఫైమాకు మరింత పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఇటీవల బీబీ జోడీ టైటిల్ సొంతం చేసుకుంది. ఫైమా-ఆర్ జే సూర్య టీం బీబీ జోడీ టైటిల్, రూ. 25 లక్షలు ప్రైజ్ మనీ అందుకుంది. జబర్దస్త్ కి మాత్రం ఫైమా దూరమైంది.