Jabardasth Mahidhar: ఈటీవీ లో ప్రసారమవుతున్న షోలలో చాలా మంచి పాపులారిటీ ని సంపాదించుకున్న షో జబర్దస్త్…మల్లెమాల వాళ్ళు ఈటీవీ తో కోలబ్రేట్ అయి ఈ షో ను నిర్వహిస్తున్నారు. ఈ షో స్టార్ట్ అయి దాదాపు 12 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి ఇప్పటికీ చాలా మంచి టిఆర్పి రేటింగ్ తో ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఈ షో నుంచే సుడిగాలి సుదీర్, హైప్ ఆది, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర లాంటి కమెడియన్లు చాలా మంచి పాపులారిటీని సంపాదించుకొని సినిమాల్లో అవకాశాలను అందుకుంటున్నారు… ఇప్పటికీ వీళ్లకు ఇండస్ట్రీలో చాలా మంచి క్రేజ్ దక్కుతుందంటే అది కేవలం జబర్దస్త్ వల్లే అనే విషయాన్ని ఎవరు మర్చిపోరు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు వస్తున్న కొంతమంది కొత్త కమెడియన్లు సైతం జబర్దస్త్ షోలో చాలా పాపులారిటీని సంపాదించుకుంటుండం విశేషం… ఒకప్పుడు జబర్దస్త్ షోలో టీం లీడర్ గా చేసిన మహిదర్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో జబర్దస్తీ షో గురించి చెప్పాడు. అక్కడ చాలా వరకు కుల రాజకీయాలు ఉన్నాయని దానివల్లే నేను అక్కడ ఎదగలేకపోయానని నా కామెడీకి జనాలు చాలా వరకు ఇంప్రెస్ అయ్యేవారని అయినప్పటికీ కొంతమంది చేసిన కుల రాజకీయాల వల్లే నేను అక్కడి నుంచి బయటికి వచ్చేసానని చెప్పాడు. ఇక ముఖ్యంగా ఆ షో లో నితిన్ – భరత్ ఉన్నప్పుడు చాలా బాగుండేదని ఆయన వెళ్లిపోయిన తర్వాత శేషు అనే ఆయన డైరెక్టర్ గా మారడం ఆ తర్వాత తన కులానికి చెందిన బాబు అనే వ్యక్తికి ఎక్కువ డైలాగులు ఉండే విధంగా చూసుకోవాలని టీం లీడర్స్ అయిన నాకు జీవన్ లకు చెప్పేవాడు.
దాంతో ఎంతసేపు బాబు మీదే డైలాగులు నడిపిస్తే టీం లీడర్స్ అయిన మాకు ఏం గుర్తింపు ఉంటుందని నేను అడిగినప్పటికీ శేషు వినలేదని చెప్పాడు. ఇక దాంతో ఈ షో లో కుల రాజకీయం ఉందని నేను కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లతో చెప్పాను.
అది వాళ్ళు శేషుతో చెప్పడంతో నా ముందుకు వచ్చి కొంతమంది నా గురించి బ్యాడ్ గా మాట్లాడుతున్నారు అంటూ శేషు చెప్పడంతో నేను ఓపెన్ అయిపోయి ఆ చెప్పేది ఎవరూ నేనే కదా…అవును చెప్పాను నువ్వు కేవలం మీ కులపు వ్యక్తి అని చెప్పి బాబు ను ఎకరేజ్ చేస్తున్నావ్ అది మాకు మైనస్ అవుతోంది కదా అని వాదించాను.
దాంతో మా ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగి నేను ఆ షో నుంచి తప్పుకున్నాను అంటూ మహిదర్ తెలియజేయడం విశేషం… మొత్తానికి అయితే జబర్దస్త్ లో కుల రాజకీయాలు ఉండడం వల్ల ఆ షో ప్రస్తుతానికి టాప్ రేంజ్ లో ముందుకు దూసుకెళ్లడం లేదని మహిధర్ చెప్పడం విశేషం…
