
నేటితరం ఆర్టిస్టులకు ‘జబర్దస్త్’ ప్రోగ్రాం అద్భుతమైన వేదికగా మారిపోయింది. ‘వాడుకున్నోడికి వాడుకున్నంత’ అన్నట్టుగా.. ఆ స్టేజ్ మీద ఎంతగా టాలెంట్ చూపిస్తే.. బయట అంతగా అవకాశాలు వచ్చిపడతున్నాయి. అలా.. జబర్దస్త్ నుంచి వెండి తెరపై సత్తా చాటుతున్న వారి లిస్టులో చేరిపోయాడు మహేష్.
Also Read: ‘ఉప్పెన’ సినిమా దర్శకుడికి నిర్మాతల ఖరీదైన గిఫ్ట్
బక్కల పలచగా.. రివటలా ఉండే మహేష్.. సైడ్ ఆర్టిస్టుగా జబర్దస్త్ స్టేజ్ ఎక్కాడు. ఆ తర్వాత తనదైన పెర్ఫార్మెన్స్ తో సత్తాచాటుతూ వచ్చాడు. ఆ తరువాత కొంత కాలానికి టీం లీడర్‌గా కూడా ఎదిగాడు. మొత్తంగా తనదైన బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్ తో ‘జబర్దస్త్ మహేష్’ అనే ట్యాగ్‌ను సంపాదించుకున్నాడు. అయితే.. ఇప్పుడు జబర్దస్త్ మహేష్‌కు వెండితెరపై మంచి ఛాన్సులు వస్తు్నాయి. కమెడియన్, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. ఏ పాత్ర ఇచ్చినా దున్నిపారేస్తున్నాడు.
రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘రంగస్థలం’ సినిమాతో మహేష్ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. చెర్రీ పక్కన చాలా సేపు కనిపించే పాత్రలో అందరినీ మెప్పించాడు మహేష్. ఆ విధంగా జబర్దస్త్ మహేష్ కాస్తా.. రంగస్థలం మహేష్ గా మారిపోయాడు. జబర్దస్త్ స్టేజ్ పై నవ్వించి, రంగస్థలం సినిమాలో ఏడిపించిన మహేష్.. ఆ తర్వాత విలన్ క్యారెక్టర్లోనూ ఒప్పించాడు.
Also Read: కేసీఆర్ బర్త్ డే వేడుకల్లో అనసూయ.. ఏం గిఫ్ట్ ఇస్తోందో తెలుసా?
ప్రస్తుతం మహేష్ మంచి ఛాన్సులతో బిజీగా ఉన్నాడు. ఆ కారణంగానే జబర్దస్త్ షోలో కనిపించడం లేదు. అయితే.. తాజాగా జబర్దస్త్ లో కనిపించాడు మహేష్. అయితే.. పర్మనెంట్ ఆర్టిస్టుగా కాదు. గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చాడు. సుడిగాలి సుధీర్ స్కిట్‌లో స్పెషల్ అప్పీయరెన్స్ గా ఎంట్రీ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
గెటప్ శ్రీను, రాం ప్రసాద్, సుధీర్ కలిసి వేసిన స్కిట్‌లో మహేష్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ స్కిట్ లో మహేష్ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్, డ్రెస్ సెన్స్ మొత్తం మారిపోవడం చూసి అందరూ ఆశ్చర్య పోయారు. ఒకప్పుడు ఇదే వేదికపై చిన్న చిన్న పాత్రలు వేసిన మహేష్.. ఇప్పుడు స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చే స్టేజ్‌కు ఎదగడం నిజంగా గొప్ప విషయం అంటున్నారు నెటిజన్లు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్