https://oktelugu.com/

Jabardasth: జబర్దస్త్ లో బూతు కామెడీ, ‘నువ్వు వస్తే పక్కే నలగదు’ అంటూ ఫైమా డైలాగ్… చూడలేం బాబోయ్!

జబర్దస్త్ షోలో డబుల్ మీనింగ్, వల్గర్ కామెడీ డోసు ఎక్కువ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. టీమ్ లీడర్స్, కమెడియన్స్ ఈ తరహా కామెడీ పై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేని కామెడీ బుల్లితెర మీద ప్రసారం అవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Written By:
  • Vicky
  • , Updated On : March 11, 2025 / 07:10 PM IST
    Jabardasth

    Jabardasth

    Follow us on

    Jabardasth: జబర్దస్త్ సక్సెస్ఫుల్ కామెడీ షో. 2013లో ప్రయోగాత్మకంగా మొదలైన ఈ షో ఊహించని స్థాయిలో ఆదరణ దక్కించుకుంది. గతంలో పలు కామెడీ షోలు ప్రేక్షకుల ముందు వచ్చాయి. కానీ విజయం సాధించలేదు. జబర్దస్త్ టీఆర్పీలో నయా రికార్డ్స్ సెట్ చేసింది. ఈ షో వేదికగా అనేక మంది సామాన్యులు స్టార్స్ గా వెలుగులోకి వచ్చారు. అనసూయ, రష్మీ, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, రామ్ ప్రసాద్, చమ్మక్ చంద్ర, జబర్దస్త్ మహేష్.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెద్దదే.

    Also Read: ఎట్టకేలకు ‘బాహుబలి 2 ‘ ని దాటేసిన ‘చావా’..’పుష్ప 2′ ని అందుకోవాలంటే ఇంకా ఎంత గ్రాస్ రావాలో తెలుసా!

    జబర్దస్త్ ఆరంభంలో డబుల్ మీనింగ్ జోక్స్ తో కూడిన కామెడీ కలిగి ఉండేది. ఒక దశలో వల్గర్ కామెడీ హద్దులు దాటేసింది. టెలివిజన్ షోలు కుటుంబ సభ్యులు అందరూ కలిసి చూస్తారు. అలాంటి షోలలో అడల్ట్ కామెడీ సరికాదనే విమర్శలు వెల్లువెత్తాయి. కమెడియన్స్ వేసిన సెటైర్స్ కొన్ని సామాజిక వర్గాల మనోభావాలు దెబ్బతీశాయి. బలగం వేణు చేసిన ఓ స్కిట్ చూసిన ఓ సామాజిక వర్గం, అతనిపై దాడి చేసింది. విమర్శల నేపథ్యంలో టీమ్ లీడర్స్ కి డబుల్ మీనింగ్ జోక్స్ ఉండకూడదు, ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా కామెడీ రాసుకోవాలని సూచనలు చేశారు.

    అప్పటి నుండి జబర్దస్త్ లో డబుల్ మీనింగ్, వల్గర్ కామెడీ శాతం తగ్గింది. అప్పుడప్పుడు జబర్దస్త్ వివాదాలు రాజేస్తూ ఉంది. హైపర్ ఆదితో పాటు కొందరు కమెడియన్స్ పంచెస్ నటులను, రాజకీయ నాయకులను కించపరిచేలా ఉన్నాయని వ్యతిరేకత వ్యక్తమైంది. వారు క్షమాపణలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. స్టార్స్ అందరూ జబర్దస్త్ ని వీడి నేపథ్యంలో ఆదరణ తగ్గింది. ప్రస్తుతం జబర్దస్త్ లో ఉన్న మెజారిటీ కమెడియన్స్ కొత్తవారే. టీఆర్పీ సైతం బాగా పడిపోయింది.

    దాంతో కమెడియన్స్ మరలా డబుల్ మీనింగ్ కామెడీ పై ఆధారపడుతున్నారు. తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమో గమనిస్తే… పొట్టి నరేష్ ని చూస్తూ.. ‘ఫైమా, ఏమండి ఫీలింగ్స్ వస్తున్నాయండీ?’ అని అంటుంది. ‘షర్ట్ నలిగిపోతుందే’ అని పొట్టి నరేష్ సమాధానం చెబుతాడు. ‘మీరు వస్తే పక్కే నలగదు ఇంకా.. షర్ట్ ఏం నలుగుతుంది లెండి’ అని ఫైమా అంటుంది. ఈ పంచ్ కొంచెం బోల్డ్ గా ఉంది. ఈ క్రమంలో జబర్దస్త్ లో డబుల్ మీనింగ్ కామెడీ ఎక్కువైందని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు.