Jabardasth Emmanuel: ‘జబర్దస్త్’ ప్రోగ్రాం ఎందరో జీవితాలను మార్చేసింది. అప్పటి వరకు ఆర్థికంగా సాధారణ స్థితిలో ఉన్నవారికి ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది. ఈ ప్రోగ్రాం లో పనిచేసినవారు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు.నిర్మాతగా ఎన్నో కష్టాలు పడ్డ మెగా హీరో నాగబాబుకు కూడా జబర్దస్త్ లైఫ్ ఇచ్చిందనే చెప్పొచ్చు. ఇప్పుడు మరో నటుడు మంచి పొజిషన్ లోకి వెళ్లాడు. కొత్త కారు కొనుక్కొని అందరికీ పరిచయం చేశాడు. ఆయనే ఇమ్మానుయేల్. ఒకప్పుడు ఈ పేరు ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు పాపులర్ అయింది. తన కామెడీ ద్వారా అశేష అభిమానులు సంపాదించుకున్న ఈ నటుడు ఇటీవల కొత్త కారును కొనుక్కున్నాడు. తన కారుతో దిగిన ఫొటోలు నెట్టింట్లో పెట్టడంతో తోటి నటులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన మెసేజ్ లు వైరల్ అవుతున్నాయి.

ఇమ్మానుయేలుది సాధారణ కుటుంబం. సినిమాలపై ఉన్న మక్కువతో అవకాశాల కోసం హైదరాబాద్ కు వచ్చాడు. దీంతో అతడికి ‘పటాస్’లో అవకాశం వచ్చింది. ఆ తరువాత ‘జబర్దస్త్’లో ఆడిషన్స్ లో పాల్గొనడంతో అక్కడా ఛాన్స్ వచ్చింది. అక్కడి నుంచి ఇమ్మానుయేల్ దశ తిరిగింది. తనదైన కామెడీ, పంచ్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మొదట్లో ఇమ్మానుయేల్ ను ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన స్కిట్ కోసం ఎదురుచూసే వారు ఎంతో మంది ఉన్నారు.
‘జబర్దస్త్’లో నటించిన వాళ్లు కొందరు సినిమాల్లో అవకాశాలు తెచ్చుకొని బిజీ అయ్యారు. మరికొందరు ఇందులోనే కొసాగుతూ స్టార్లుగా గుర్తింపు పొందారు. ఈ ప్రోగ్రాం ద్వారా ఇమ్మానుయేల్ కూడా స్టార్ డం వచ్చింది. దీంతో ఆయన బాగానే సంపాదించినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన ఇటీవల కొత్త కారును కొనుగోలు చేశాడని అంటున్నారు. ఇమ్మానుయేల్ హుండాయ్ కంపెనీకి చెందిన వెన్యూ మైక్రో ఎస్ యూవీని అనే రెడ్ కలర్ ను తీసుకున్నాడు. కారు డెలివరీ చేసే సమయంలో దిగిన ఫొటోలను నెట్టింట్లో పెట్టి స్వయంగా ఆయనే ఈ విషయాన్ని తెలిపాడు. ఆయనతో పాటు నటి రోహిణి కూడా ఉంది.

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టాడు. ‘నేను ఎప్పుడూ ఇలా కారు కొంటానని అనుకోలేదు. ఇలాంటి ఓ రోజు వస్తుందని అస్సలు ఊహించలేదు. ఈ మధుర క్షణాలను మీతో పంచుకోవాలని ఉంది. అందుకే ఈ ఫొటోలను మీ ముందు ఉంచుతున్నా..’ అని రాసుకొచ్చాడు. దీంతో ఆయన మెసేజ్ పై శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ కారు విలువ రూ.15 లక్షలు అనితెలిపాడు. దీంతో ఆయన సంపాదన ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు.
సినిమాల్లో అవకాశాలు రానివారికి ‘జబర్దస్త్’ చాలా మందికి లైఫ్ ఇచ్చింది. తన జీవితం కూడా ఈ పొజిషన్లో ఉండడానికి ఈ ప్రొగ్రామే కారణమని ఇమ్మానుయేల్ పలు సందర్భాల్లో తెలిపాడు. ఇమ్మానుయేల్ జబర్దస్త్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మిగతా వారికంటే ఈయన చేసే కామెడీ విపరీతంగా ఆకట్టుకుంటుంది. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్టార్ గా గుర్తింపు పొందాడు ఇమ్మానుయేల్.