https://oktelugu.com/

Jabardasth: జబర్దస్త్ షోలో రెమ్యునరేషన్లు అంత తక్కువా.. స్కిట్ కు రూ.20,000 ఇస్తారంటూ?

Jabardasth: ఈ మధ్య కాలంలో జబర్దస్త్ షోలో కమెడియన్ల రెమ్యునరేషన్లను సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. కొంతమంది కమెడియన్లు నెలకు 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే కొన్ని నెలల క్రితం వరకు జబర్దస్త్ షో కోసం పని చేసి ప్రస్తుతం కామెడీ స్టార్స్ షోలో స్కిట్లు చేస్తున్న అప్పారావు తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 18, 2022 / 04:11 PM IST
    Follow us on

    Jabardasth: ఈ మధ్య కాలంలో జబర్దస్త్ షోలో కమెడియన్ల రెమ్యునరేషన్లను సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. కొంతమంది కమెడియన్లు నెలకు 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే కొన్ని నెలల క్రితం వరకు జబర్దస్త్ షో కోసం పని చేసి ప్రస్తుతం కామెడీ స్టార్స్ షోలో స్కిట్లు చేస్తున్న అప్పారావు తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

    కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఏజ్ ఫ్యాక్టర్ వల్ల తమను షోకు పిలవలేదని ఆ తర్వాత కొన్ని నెలల పాటు హోల్డ్ లో పెట్టడంతో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకున్నానని అప్పారావు తెలిపారు. బుల్లెట్ భాస్కర్ టీమ్ లో కంటెస్టెంట్ కంటే హీనంగా పాత్ర తగ్గిందని ఆయన వెల్లడించారు. 2014 నుంచి తాను జబర్దస్త్ షోలో చేశానని తాను సీనియర్లలో ఒకడినని ఆయన చెప్పుకొచ్చారు. తనకు వచ్చిన సమస్య ఏంటో వాళ్లు అడగలేదని అప్పారావు వెల్లడించారు.

    చెప్పుడు మాటలు వినేవాళ్లు ఇంకా ప్రమాదకరమని అప్పారావు పేర్కొన్నారు. జబర్దస్త్ నాకు ఆరో షో అని ఆయన పేర్కొన్నారు. మనసు బాధ పడితే మనసు మాట వినదని ఆయన వెల్లడించారు. కామెడీ స్టార్స్ షోలో డబుల్ పేమెంట్ ఇస్తున్నారని కామెడీ స్టార్స్ మంచి రేటింగ్ వస్తోందని ఆయన పేర్కొన్నారు. జబర్దస్త్ తర్వాత తాను 150 సినిమాలలో చేశానని ఆయన వెల్లడించారు.

    ఒకప్పుడు జబర్దస్త్ కు 18 రేటింగ్ ఉందని ఇప్పుడు 6కు అటూఇటుగా రేటింగ్ ఉందని ఆయన చెప్పుకొచ్చారు. జబర్దస్త్ లో స్కిట్ కు 20,000 రూపాయల నుంచి 1,30,000 రూపాయల వరకు ఇస్తారని అప్పారావు తెలిపారు. ఆ డబ్బులు స్కిట్ లో పాల్గొన్న వాళ్లతో పంచుకోవాల్సి ఉంటుందని అప్పారావు వెల్లడించారు.