Rithu Chowdary: జబర్దస్త్ లేడీ కమెడియన్ రీతూ చౌదరి గ్లామర్ షో అంతకంతకూ శృతి మించుతోంది. ఇంస్టాగ్రామ్ వేదికగా అమ్మడు సెగలు పుట్టిస్తోంది. రీతూ చౌదరి వీడియోలు, ఫోటోలపై ఎన్ని విమర్శలు వచ్చినా తగ్గడం లేదు. రీతూ చౌదరి కెరీర్ సీరియల్ నటిగా మొదలైంది. ఆమె పలు సీరియల్స్ లో కీలక రోల్స్ చేసింది. అయితే ఎలాంటి గుర్తింపు రాలేదు. దాంతో జబర్దస్త్ షోకి వచ్చింది. లేడీ కమెడియన్ గా మారింది. హైపర్ ఆది టీం లో ఎక్కువగా స్కిట్స్ చేసింది.
జబర్దస్త్ అత్యంత ప్రజాదరణ కలిగిన షో కావడంతో ఆమె అనతికాలంలో ఫేమ్ తెచ్చుకుంది. కారణం తెలియదు కానీ… సడన్ గా షో నుండి తప్పుకుంది. ఇంస్టాగ్రామ్ లో మాత్రం ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. బోల్డ్ ఫోటో షూట్స్, వీడియోలకు ఆమె పెట్టింది పేరు. పొట్టిబట్టల్లో విపరీతమైన స్కిన్ షో చేస్తుంది. రీతూ చౌదరి ఎక్స్పోజ్ చేయడం పై తరచుగా విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. అయినా రీతూ చౌదరి అవేమీ పట్టించుకోదు.
ఇంస్టాగ్రామ్ సెలెబ్స్ కి ఆదాయమార్గంగా మారింది. ఫాలోవర్స్ సంఖ్య ఆధారంగా లక్షల నుండి కోట్లు సంపాదించవచ్చు. మరి ఫాలోవర్స్ పెరగాలి అంటే గ్లామరస్ ఫోటో షూట్స్ తప్పనిసరి. రీతూ చౌదరిని ఇంస్టాగ్రామ్ లో వన్ మిలియన్ కి పైగా ఫాలో అవుతున్నారు. తాజాగా రీతూ చౌదరి పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. కురచ దుస్తుల్లో డాన్సు చేస్తూ నెటిజెన్స్ గుండెల్లో గుబులు రేపింది.
ఇక రీతూ చౌదరి బోల్డ్ వీడియోపై నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అటు నటిగా కూడా రీతూ చౌదరి ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవల ప్రైమ్ లో విడుదలైన వ్యూహం సిరీస్లో రీతూ చౌదరి ఒక పాత్ర చేసింది. కాగా రీతూ చౌదరి మార్పింగ్ వీడియోలు సోషల్ మీడియాలో కొందరు వైరల్ చేస్తున్నారట. దీనిపై సైబర్ క్రైమ్ లో రిపోర్ట్ చేసిన రీతూ చౌదరి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయించింది. కాగా గత ఏడాది రీతూ చౌదరి తండ్రి హఠాన్మరణం పొందాడు. తండ్రి దూరం కావడంతో చాలా బాధపడింది.
View this post on Instagram