Jabardasth Apparao: మీడియాకు దూరంగా ఉంటున్న ప్రముఖులను, వృద్ధాప్యంలో ఉన్న నటులను బ్రతికుండగానే యూట్యూబర్స్ చంపేస్తున్నారు. వ్యూస్ కి, కాసులకు కక్కుర్తి పడి దారుణమైన థంబ్ నెయిల్స్ పెడుతున్నారు. సుమన్, చంద్రమోహన్, కోటా శ్రీనివాసరావు, సుధాకర్ ఇలా చాలా మంది నటులు చనిపోయారంటూ థంబ్ నెయిల్స్ పెట్టిన యూట్యూబర్స్ ఉన్నారు. ఇటీవల కోటా శ్రీనివాసరావు చనిపోయారని సోషల్ మీడియాలో పోస్ట్ పోస్ట్స్ వెలిశాయి. నిజమే అని నమ్మిన పోలీసులు ప్రముఖుల భద్రత కోసం ఆయన నివాసానికి వెళ్లారు.
స్వయంగా పోలీసు వాహనానికి కోటా శ్రీనివాసరావు ఎదురు రావడంతో వాళ్ళు ఖంగుతిన్నారు. ఇదేంటండి మీరు చనిపోయారని న్యూస్ అని పోలీసులు కోటాకు చెప్పారట. ఈ వార్తల మీద జబర్దస్త్ అప్పారావు ఆవేదన చెందారు. దయచేసి మమ్మల్ని, మా కుటుంబాలను మానసిక క్షోభకు గురి చేయవద్దని ఆయన ఆక్రోశం వ్యక్తం చేశారు. యూట్యూబర్స్ కి ఒకటి చెప్పాలి. దీని మీద నేనొక నాటిక కూడా రాద్దాం అనుకున్నాను. ప్రముఖులు బ్రతికుండగానే చనిపోయారని థంబ్ నెయిల్స్ పెడుతున్నారు.
సోషల్ మీడియా చాలా బలంగా ఉంది. అయితే బ్రతికున్న వ్యక్తులను చంపేసే హక్కు మీకు లేదు. అందరూ చనిపోతారు. ఈ వార్తలు రాసే వాళ్ళు కూడా చనిపోతారు. లింక్ క్లిక్ చేయడం కోసం చనిపోయారని థంబ్ నెయిల్ పెట్టడం క్షమించారని నేరం. ఆ థంబ్ నెయిల్స్ మానసిక వేదనకు దారితీస్తున్నాయి. పెద్దవారి తరుపున కూడా నేను కోరుకుంటున్నాను, అన్నారు.
కమెడియన్ కావాలనే తపనతో అప్పారావు పరిశ్రమలో అడుగుపెట్టాడు. జబర్దస్త్ కామెడీ షో అప్పారావుకు బ్రేక్ ఇచ్చింది. 2013లో జబర్దస్త్ మొదలు కాగా టీమ్ మెంబర్ గా అప్పారావు ఛాన్స్ దక్కించుకున్నాడు. మొదట్లో షకలక శంకర్ టీమ్ లో చేశాడు. తర్వాత పలువురు టీమ్ లీడర్స్ తో పని చేశాడు. అలాగే పదుల సంఖ్యలో చిత్రాల్లో నటించారు. అప్పారావు వందకు పైగా చిత్రాల్లో నటించినట్లు సమాచారం.