Jabardasth comedian : ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయిన పటాస్ షో అప్పట్లో చాలా మందికి లైఫ్ ఇచ్చింది. ఈ షో ద్వారా తమ ట్యాలెంట్ ప్రూఫ్ చేసుకుని కొందరు బుల్లితెర స్టార్స్ గా ఎదిగారు. ఫైమా, పంచ్ ప్రసాద్, యాదమ్మ రాజు, సద్దాం, నూకరాజు, హరి… పటాస్ ద్వారా వెలుగులోకి వచ్చారు. నిజానికి యాంకర్ శ్రీముఖికి కూడా పటాస్ తో బ్రేక్ వచ్చింది. యాంకర్ రవితో పాటు శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించింది. పటాస్ తో ఫేమ్ తెచ్చుకున్న మరొక కమెడియన్ గల్లీ బాయ్ భాస్కర్. పటాస్ షోలో స్టాండ్ అప్ కమెడియన్ గా కెరీర్ ప్రారంభించాడు భాస్కర్. తనదైన కామెడీ తో అలరించాడు.
సద్దాం, యాదమ్మ రాజుతో కలిసి ఎక్కువగా స్కిట్స్ చేస్తూ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. ఆ తర్వాత పలు కామెడీ షోలలో ఆకట్టుకున్నాడు గల్లీ బాయ్ భాస్కర్. అదిరింది, కామెడీ స్టార్స్, కామెడీ స్టార్ ఎక్సచేంజ్ వంటి షోలు చేశాడు. ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో గల్లీ బాయ్ భాస్కర్ సందడి చేస్తున్నాడు. తాజాగా తన కల సాకారం చేసుకున్నానంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.
భాస్కర్ రీసెంట్ గా కొత్త ఇల్లు కట్టుకున్నాడు. ఓ మూడు అంతస్థుల బిల్డింగ్ నిర్మించుకున్నారు. గృహప్రవేశం ప్రవేశం చేశాడు. ఆ వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు షేర్ చేశాడు. నా డ్రీమ్ హౌస్ కట్టుకున్నాను .. నాకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు అని తెలిపాడు. ఇక వీడియో లో తన కొత్త ఇంటిని .. తన కుటుంబ సభ్యులతో పూజలు చేస్తున్న ఫోటోలు పంచుకున్నారు.
ఈ శుభ కార్యానికి జబర్దస్త్ కమెడియన్లు, భాస్కర్ స్నేహితులు, సన్నిహితులు హాజరయ్యారు. భాస్కర్ ఇల్లు చూసి తన అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. బుల్లితెరపై భాస్కర్ బిజీగా ఉన్నాడు. గతంలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. అవేమీ ఆయనకు గుర్తింపు తేలేదు. బుల్లితెర కమెడియన్ గా సంపాదించిన డబ్బులతో ఇంటిని నిర్మించుకున్నాడు. అందుకు అభినందించాల్సిందే.