KCR Movie: జబర్దస్త్ కమెడియన్స్ హీరోలుగా మారడం ట్రెండ్ అయ్యింది. ఇప్పటికే సుడిగాలి సుధీర్ పూర్తి స్థాయి హీరో అవతారం ఎత్తాడు. మూడు చిత్రాల వరకూ చేశాడు. ఆయన లాస్ట్ రిలీజ్ గాలోడు హిట్ కూడా అయ్యింది. ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. అలాగే గెటప్ శ్రీను రాజు యాదవ్ టైటిల్ తో హీరోగా ఓ మూవీ తెరకెక్కుతుంది. పలువురు జబర్దస్త్ కమెడియన్స్ వెండితెర మీద రాణిస్తున్నారు. కాగా మరొక జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ హీరో అవుతున్నారు. ఓ సంచలన చిత్రంతో రాకేష్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
కేసీఆర్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది. మల్లారెడ్డి యూనివర్సిటీలో 50 అడుగుల కట్ అవుట్ ఏర్పాటు చేసి, 50 వేల మంది విద్యార్థుల సమక్షంలో టైటిల్ లాంచ్ చేశారు. కేసీఆర్ అనగానే మనకు తెలంగాణ సాధకుడు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గుర్తొస్తారు. కట్ అవుట్ కూడా ఆయన్ని పోలి ఉంది. ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. అయితే ఈ చిత్రంలో కేసీఆర్ అంటే కేశవ్ చంద్ర రామావత్ అని తెలుస్తుంది.
ఇది తెలంగాణ ప్రాంత బంజారా నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం అని సమాచారం. గరుడవేగ చిత్రానికి డిఓపీగా పని చేసిన అంజి ఈ చిత్ర దర్శకుడు. రాకేష్ కి జంటగా అనన్య నటిస్తుంది. తనికెళ్ళ భరణి, కృష్ణ భగవాన్ కీలక రోల్స్ చేస్తున్నారు. ధన్ రాజ్, రచ్చ రవి, జోర్దార్ సుజాత, తాగుబోతు రమేష్ తో పాటు పలువురు నటిస్తున్నారు. గ్రీన్ టీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో విభూది క్రియేషన్స్ నిర్మిస్తున్నారు.
టైటిల్ తోనే ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి. ఇక రాకింగ్ రాకేష్ జబర్దస్త్ లో టీమ్ మెంబర్ గా ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం తన టాలెంట్ తో టీమ్ లీడర్ అయ్యాడు. చిన్న పిలల్లతో రాకింగ్ రాకేష్ చేసే స్కిట్స్ బాగా ఫేమస్. ఈ ఏడాది రాకేష్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. మరో బుల్లితెర సెలబ్రిటీ జోర్దార్ సుజాతతో రాకింగ్ రాకేష్ వివాహం జరిగింది. వీరిద్దరూ జబర్దస్త్ లో రాణిస్తున్నారు. కేసీఆర్ సినిమా హిట్ కావాలని రాజేష్ అభిమానులు కోరుకుంటున్నారు.