Jaat Movie: ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ ని దున్నేస్తూ ముందుకు దూసుకుపోతున్న చిత్రం ‘జాట్'(Jaat Movie). సీనియర్ మాస్ హీరో సన్నీ డియోల్(Sunny Deol) హీరో గా నటించిన ఈ సినిమాకు గోపీచంద్ మలినేని(Gopichand Malineni) దర్శకత్వం వహించగా, థమన్ సంగీతం అందించాడు. రణదీప్ హూడా, రెజీనా కాసాండ్రా ఈ చిత్రంలో విలన్స్ గా నటించారు. మొదటి ఆట నుండే సూపర్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి ఓపెనింగ్ వసూళ్లు అదిరిపోయాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రెండు రోజుల్లో 15 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. ఇదే రేంజ్ జోరుని కొనసాగిస్తూ ముందుకు పోతే కచ్చితంగా ఈ చిత్రం వంద కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి.
అదేమిటంటే ఈ చిత్రాన్ని ముందుగా మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja) తో చేయాలని అనుకున్నారట. అప్పట్లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ గోపీచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్ లో ఒక సినిమాని ప్రకటించి, గ్రాండ్ తో ప్రారంభోత్సవాన్ని జరిపి, ఫోటోషూట్ ని కూడా ఏర్పాటు చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. రెగ్యులర్ షూటింగ్ మరో వారం రోజుల్లో మొదలు అవ్వబోతుంది అనుకుంటుండగా అకస్మాత్తుగా ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యినట్టు వార్తలు వినిపించాయి. ఆ సినిమా మరేదో కాదు, జాట్ చిత్రమే. కారణం బడ్జెట్ వర్కౌట్ అవ్వగా రద్దు చేసారని అప్పట్లో చర్చ జరిగింది. కానీ ‘జాట్’ మూవీ ని చూసిన తర్వాత అంత భారీ బడ్జెట్ పెట్టినట్టు ఎక్కడా అనిపించలేదు. కాబట్టి అది కేవలం పుకారు మాత్రమే. సినిమా రద్దు అవ్వడానికి వేరే ఏదైనా కారణం అయ్యుండొచ్చు.
ఇక రవితేజ తో ఈ ప్రాజెక్ట్ వద్దు అనుకున్న తర్వాత బాలీవుడ్ లో బడా సూపర్ స్టార్ తో చేయాలని అనుకున్నారు. ముందుగా సల్మాన్ ఖాన్ తో చేయాలని అనుకున్నాడు. కానీ ఆయనేమో ‘సికందర్’ మూవీ షూటింగ్ తో బిజీ గా ఉండడం తో చేయలేకపోయాడు. అలా చివరికి ఈ చిత్రం సన్నీ డియోల్ వద్దకు వచ్చి చేరింది. ఒకవేళ రవితేజ కానీ, సల్మాన్ ఖాన్ కానీ ఒప్పుకొని ఈ సినిమా చేసుంటే వాళ్లకు అతి పెద్ద కం బ్యాక్ మూవీ అయ్యేది. ప్రస్తుతం ఈ ఇద్దరి హీరోలు ఏ రేంజ్ ఫ్లాప్స్ లో ఉన్నారో మన అందరికీ తెలిసిందే. వీళ్ళ కెరీర్ కి ఈ చిత్రం పెద్ద పాజిటివ్ అవ్వడం మాత్రమే కాకుండా, చాలా కాలం నుండి ఈ హీరోల అభిమానులను డిప్రెషన్ నుండి బయటకి తీసుకొని వచ్చేది. అలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోలు వదులుకున్నారు.