
Mahesh Babu : హీరో మహేష్ విషయంలో వయసు జస్ట్ నెంబర్ మాత్రమే. ఈ 47 ఏళ్ల స్టార్ హీరో స్టిల్ కాలేజ్ బాయ్ లుక్ మైంటైన్ చేస్తున్నాడు. మిగతా హీరోలతో పోల్చితే మహేష్ వయసు కొంచెం ఎక్కువే. లుక్స్ పరంగా వారందరికంటే తక్కువ కనిపిస్తున్నారు. మహేష్ తన లేటెస్ట్ ఫోటోషూట్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా ఫ్యాన్స్ వావ్ అంటున్నారు. అసలు ఇంత అందంగా కనిపిస్తే అమ్మాయిలు నిద్ర పోవడం కష్టమే. వాళ్ళ గుండెల్లో మహేష్ గూడుకట్టుకోవడం ఖాయం. మహేష్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. వారసత్వంగా మహేష్ గ్లామర్ పుణికిపుచ్చుకున్నారు.
దానికి తోడు క్రమ శిక్షణతో కూడిన లైఫ్ స్టైల్ కలిగి ఉన్నారు. ఒకప్పుడు మహేష్ సిగరెట్స్ విపరీతంగా తాగేవారట. ఆ అలవాటు ఆయన మెల్లగా వదిలేశారు. చెడు అలవాట్లు పక్కన పెట్టి ఆరోగ్యకరమైన అలవాట్లకు దగ్గరయ్యారు. రోజూ వ్యాయామం చేయడం. మంచి ఆహారం తీసుకోవడం, ఫ్యామిలీతో ఆనందంగా గడపడం మహేష్ గ్లామర్ సీక్రెట్స్ అని చెప్పొచ్చు. మహేష్ వైఫ్ నమ్రత సైతం ఫిట్ అండ్ స్లిమ్ బాడీ కలిగివున్నారు. మహేష్ కంటే నమ్రత వయసులో నాలుగేళ్లు పెద్దది. ఆమె ఫిఫ్టీ ప్లస్ లో అడుగుపెట్టారు. నమ్రతకు ముప్పై ఏళ్ళు అంటే నమ్మేస్తారు.
మహేష్-నమ్రత టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా ఉన్నారు. వీరిద్దరూ ప్రొఫెషనల్ లో ఎంత సీరియస్ గా ఉంటారో… ఫ్యామిలీకి అంత వాల్యూ ఇస్తారు. ఎన్ని పనులున్నా పిల్లలతో గడపడం మానరు. ప్రతి ఏడాది కనీసం పది విదేశీ ట్రిప్స్ కి వెళతారు. ఎక్కడికెళ్లినా నలుగురు కలిసే వెళతారు. పిల్లలు గౌతమ్, సితార చాలా మెచ్యూరిటీగా ఆలోచిస్తారు. మహేష్ తో పాటు నమ్రత, సీతారలకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ప్రస్తుతం త్రివిక్రమ్ తో మూవీ చేస్తున్న మహేష్ దర్శకుడు రాజమౌళితో ఓ చిత్రం ప్రకటించారు. సెప్టెంబర్ నుండి ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందనే ప్రచారం జరుగుతుంది. రాజమౌళి కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో మహేష్ మూవీ తెరకెక్కనుంది. ఇది జంగిల్ అడ్వెంచర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాజమౌళి తెరకెక్కించనున్నారు. ఇక త్రివిక్రమ్ మూవీ విషయానికి వస్తే చాలా వరకు షూటింగ్ జరుపుకుంది. 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. పూజా హెగ్డే శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
View this post on Instagram