https://oktelugu.com/

Itlu Maredumilli Prajanikam Teaser Talk: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజర్ టాక్: విభిన్న కథతో షాక్ ఇచ్చిన అల్లరి నరేష్

Itlu Maredumilli Prajanikam Teaser Talk: నేడు అల్లరి నరేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజర్ ని రిలీజ్ చేసింది టీమ్. పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న ఈ సీరియస్ డ్రామాలో నరేష్ చాలా బాగా నటించాడు. సినిమా విషయానికి వస్తే.. ఎక్కడో మారుమూల అడవుల్లో నివసించే గిరిజన జాతి జీవితాలు ఆధారంగా ఈ టీజర్ నడిచింది. కనీస సౌకర్యాలు కూడా లేని, వారి జీవితాల్లో నరేష్ పాత్ర […]

Written By:
  • Shiva
  • , Updated On : June 30, 2022 / 05:58 PM IST
    Follow us on

    Itlu Maredumilli Prajanikam Teaser Talk: నేడు అల్లరి నరేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజర్ ని రిలీజ్ చేసింది టీమ్. పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న ఈ సీరియస్ డ్రామాలో నరేష్ చాలా బాగా నటించాడు. సినిమా విషయానికి వస్తే.. ఎక్కడో మారుమూల అడవుల్లో నివసించే గిరిజన జాతి జీవితాలు ఆధారంగా ఈ టీజర్ నడిచింది.

    allari naresh

    కనీస సౌకర్యాలు కూడా లేని, వారి జీవితాల్లో నరేష్ పాత్ర ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది అనేది సినిమా మెయిన్ పాయింట్. ఈ క్రమంలో నరేష్ పాత్ర ఎదుర్కొనే విపత్కర పరిస్థితులు కూడా చాలా ఎమోషల్ గా ఉన్నాయి. నరేష్ తాజాగా ఈ టీజర్ తో అదిరిపోయే అప్ డేట్ తో ఎంట్రీ ఇచ్చాడు. తన నుంచి మరో వైవిధ్యమైన సినిమా రాబోతుందని సడెన్ గా ఒక చిన్న టీజర్ తో ప్రేక్షకులకు షాక్ ఇచ్చాడు.

    Also Read: Nidhhi Agerwal: 60 ఏళ్ల హీరోలకు 28 ఏళ్ళ హీరోయిన్ సై అంటుంది

    అల్లరి నరేష్ ఈ మధ్య సరికొత్త కథలతో విభిన్నమైన చిత్రాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సారి నిజంగానే నరేష్ నుంచి కొత్తరకం సినిమా రాబోతుంది. పైగా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజర్ లో అద్భుతమైన టెక్నికల్ వ్యాల్యూస్ ఉన్నాయి. ఆ అద్భుతానికి మించి అత్యున్నతమైన విజువల్స్ కనిపిస్తున్నాయి.

    allari naresh

    పైగా కాన్సెప్ట్ కూడా వినూత్నంగా ఉంది. అందుకే ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. పైగా ఈ టీజర్ లో నరేష్ చెప్పిన డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చారు.

    ఇక ఈ మారేడుమిల్లి నియోజకవర్గం సినిమా షూటింగ్ పార్ట్ కూడా సగం పూర్తి చేసుకుంది. ఇదొక వెరీ సీరియస్ సినిమా. మొత్తానికి అల్లరి నరేష్ హాస్యానికి పూర్తిగా సెలవు ప్రకటించినట్లు ఉన్నాడు.

    Also Read:Manjusha Rampalli: జబర్దస్త్ లో అనసూయ ప్లేసులో ఏం యాంకర్ ను తీసుకుంటున్నారో తెలుసా?

    Tags