Itlu Arjuna Movie: ఈ వారం విడుదల అవ్వబోతున్న సినిమాల్లో ప్రేక్షకులను ప్రమోషనల్ కంటెంట్ తో ప్రత్యేకంగా ఆకర్షించిన చిత్రం ‘ఇట్లు అర్జున’. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన పాటలు, టీజర్ , ట్రైలర్, ఇలా ప్రతీ ఒక్కటి ప్రేక్షకులను అలరించాయి. చాలా కాలం తర్వాత యూత్ ఆడియన్స్ ని అలరించే సినిమా రాబోతుందని నమ్మకం ట్రేడ్ లో కలిగింది. ఈ చిత్రం లో హీరో హీరోయిన్లు గా అనీష్, అనశ్వర రాజన్ నటించారు. అనశ్వర రాజన్ యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ , కానీ అనీష్ ఎవరు అనేది మాత్రం అత్యధిక శాతం మంది ఆడియన్స్ కి తెలియదు. ఇతని సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ , అక్కినేని నాగార్జున , అక్కినేని అఖిల్ లాంటి క్రేజీ హీరోలందరూ వచ్చి ప్రొమోషన్స్ చేస్తున్నారు, ఇంతకీ ఎవరు ఇతను ?, ఇతని బ్యాక్ గ్రౌండ్ వివరాలు ఏంటి? అని తెలుసుకోవడానికి నెటిజెన్స్ తెగ ప్రయత్నిస్తున్నారు.
అయితే ఇతను మరెవరో కాదు, AMR constructions సంస్థ అధినేత మహేష్ రెడ్డి కుమారుడు. మహేష్ రెడ్డి కి సినీ ఇండస్ట్రీ లోని ప్రముఖులతో పాటు, రాజకీయ నాయకులతో కూడా అత్యంత సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఆయన ఫైనాన్స్ కూడా అందించాడు. అందుకే అతని కుమారుడిని లాంచ్ చేయడానికి టాలీవుడ్ మొత్తం కదిలింది. అదృష్టం కలిసి రావడం తో సినిమా పైన కూడా ఆడియన్స్ లో మంచి హైప్ ఏర్పడింది. రేపు విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో ని కాసేపటి క్రితమే ప్రదర్శించారు. ఈ షో నుండి ఈ చిత్రానికి వస్తున్న టాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇందులో హీరో మూగవాడి క్యారెక్టర్ చేసిన సంగతి తెలిసిందే.
మొదటి సినిమాలోనే ఇలాంటి క్యారెక్టర్ ని ఎంచుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. ఇండస్ట్రీ లో ఎంతో కాలం నుండి స్థిరపడిన హీరోలు కూడా ఇలాంటి పాత్రలు ఎంచుకోవడానికి సాహసం చూపించరు, అలాంటిది అనీష్ మొదటి సినిమాలోనే అలాంటి పాత్ర ని ఎంచుకోవడం గొప్ప సాహసమే. చాలా అద్భుతంగా నటించాడట కూడా. సినిమాలో ఫన్నీ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయని , అదే విధంగా యాక్షన్ సన్నివేశాలు , సెంటిమెంట్ సన్నివేశాలు కూడా బాగా వచ్చాయని , తమన్ మ్యూజిక్ ఈ చిత్రాన్ని మరో లెవెల్ కి తీసుకెళ్లిందని, కమర్షియల్ గా ఈ చిత్రం బాగా వర్కౌట్ అవుతుందని అంటున్నారు. ప్రీమియర్ షో నుండి వచ్చిన ఈ టాక్ , పబ్లిక్ నుండి కూడా వస్తే ఇక తిరుగు ఉండదనే చెప్పాలి. మేకర్స్ ప్రొమోషన్స్ కూడా చాలా అగ్రెస్సివ్ గా చేస్తున్నారు. ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ చిత్రం పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.