Varanasi: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణం ఏంటి అంటే వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి ఒక్క ఆకట్టుకునే విధంగా సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని మెప్పించిన హీరోలు చాలామంది ఉన్నప్పటికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు సైతం ప్రస్తుతం పాన్ ఇండియా బాట పడుతుండడం విశేషం… ఇక ప్రస్తుతం మహేష్ బాబు పాన్ వరల్డ్ సినిమాని చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా అందర్నీ ఆదరిస్తున్నారు. ఇక రాజమౌళి మాత్రం ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమాతో యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ ని మరో మెట్టు పైకి ఎక్కిస్తున్నారు. ఇక రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా మొదటి పాన్ వరల్డ్ సినిమాగా రాబోతోంది. ఇక ఈ సినిమాతో వీళ్ళిద్దరూ ఒక ట్రెండ్ సెట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమా చేసిన కూడా రాజమౌళి నుంచి వచ్చే సినిమాకి గొప్ప ఆదరణ దక్కుతోంది.
ఆ సినిమా చూడకపోతే ఇక మనం ఉండి వేస్ట్ అనే అంత రేంజ్ లో రాజమౌళి ఈ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ చేస్తాడు. కాబట్టి మొదటి రోజు ఈయన సినిమాలు చూడడానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు… ‘వారణాసి’ గా టైటిల్ ను ఫిక్స్ చేసిన ఈ సినిమాలో మహేష్ బాబు 30 నిమిషాల పాటు రాముడి పాత్రను పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది.
రాజమౌళి ఈ విషయాన్ని తనే స్వయంగా తెలియజేశాడు. నిజానికి మహేష్ బాబు ను రాముడి పాత్రలో చూడడం ఒకే కానీ రామ్ చరణ్ ఇలాంటి పాత్రకు బాగా సెట్ అయ్యేవాడు అని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ‘త్రిబుల్ ఆర్ ‘ ఎండింగ్లో అల్లూరి సీతారామరాజు గా కనిపించిన రామ్ చరణ్ ను చూసి చాలామంది ఆయన రాముడు అవతారంలో ఉన్నాడని అనుకున్నారు. ఇక గెటప్ ఆయనకి బాగా సెట్ అయింది. కాబట్టి ఈ సినిమాలో కూడా రామ్ చరణ్ ఉంటే బాగుండేదని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక మరికొంతమంది మహేష్ బాబు అభిమానులు మాత్రం మహేష్ బాబు కూడా రాముడు పాత్ర చాలా బాగా సెట్ అవుతుందని ఆయన ఒక్కసారి ఆ పాత్ర వేసిన తర్వాత మిగతా వాళ్ళు వేసిన పాత్ర లు ఏవి గుర్తు రావని చెబుతుండడం విశేషం…ఇక రాజమౌళి మహేష్ బాబుని ఏ రేంజ్ లో చూపిస్తాడు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…