RGV Comments On Mahesh Babu: ‘శివ’ సినిమాతో ఇండస్ట్రీలో పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ…ఒకప్పుడు ఆయన దర్శకత్వంలో నటించడానికి చాలామంది హీరోలు ఆసక్తి చూపించేవారు. ఎందుకంటే ఆయన ప్రతి హీరోని కొత్తగా చూపిస్తాడనే నమ్మకం అందరిలో ఉండేది. కానీ ఆయన మాత్రం కొంతమంది హీరోలతోనే సినిమాలను చేయడానికి ఆసక్తి చూపించాడు. ఇక ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి ఒక సినిమా చేయాలనుకున్నాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. దాంతో మహేష్ బాబు కోసం గ్యాంగ్ స్టర్ మూవీ కథ రాసుకున్నాడు. ఇక అదే కథను పూరి జగన్నాథ్ కి చెబితే ఈ సినిమా నేను చేసుకుంటానని పూరి చెప్పడంతో ఆర్జీవి సరే అని ఆ కథను పూరీకి ఇచ్చేశాడు. మొత్తానికి పూరి జగన్నాథ్ విషయంలో రామ్ గోపాల్ గారు చాలా సాఫ్ట్ కార్నర్ తో ఉంటాడు. తనకి ఇష్టమైన ప్రియ శిష్యుడు కూడా పూరి జగన్నాథ్ కావడం విశేషం…
ఇక ఏది ఏమైనా కూడా పూరి జగన్నాధ్ మహేష్ బాబు ను పెట్టి చేసిన ‘బిజినెస్ మేన్’ సినిమాను చాలా గొప్పగా తీర్చిదిద్దాడు… అయినప్పటికి మహేష్ బాబు పాత్ర వర్మకి నచ్చిన కూడా ఆయన తీస్తే వేరేలా ఉండేది అంటూ పలువురు సినీ మేధావులు సైతం వర్మ గురించి చాలా గొప్పగా చెబుతుంటారు. ఇక దాంతోపాటు పూరి జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన ‘టెంపర్’ సినిమా రిలీజ్ అయినప్పుడు ‘బిజినెస్ మెన్’ సినిమాలో హీరో క్యారెక్టర్ ను ఉద్దేశించి వర్మ మాట్లాడటం అప్పట్లో పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది.
టెంపర్ మూవీలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పేరు దయ అలాగే బైండ్ మెన్ మూవీలో మహేష్ బాబు పాత్ర పేరు సూర్య భాయ్….ఇక టెంపర్ లో దయ గాడు అద్భుతంగా చేశాడు. ఎంతలా అంటే సూర్యభయి గాడి కంటే బాగా చేశాడు అంటూ సినిమాల్లోని పాత్రల పేర్లను బట్టి ఆయన మాట్లాడిన మాటలు అప్పట్లో పెను సంచలనాన్ని క్రియేట్ చేశాయి…
ఆ మాటలు మహేష్ బాబు అభిమానులను సైతం తీవ్రంగా కలిసి వేశాయి. ఇక ఏదేమైనా కూడా వర్మ చాలా స్ట్రెయిట్ గా చెబుతాడు. కాబట్టి ఆయన మాటలకి చాలామంది హర్ట్ అవుతూ ఉంటారు… అవేవి పట్టించుకోకుండా తనకు నచ్చింది మాట్లాడుకుంటూ నచ్చిన సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడు…మొత్తానికైతే ఆర్జీవీ శివ సినిమాను రీసెంట్ గా రీ రిలీజ్ చేశారు. ఈ సినిమాని చూసి చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు…