Minister Roja Assets: టాలీవుడ్ లో దశాబ్దం కి పై స్టార్ హీరోయిన్ గా కొనసాగిన వారిలో రోజా కూడా ఒకరు..ఒక్కప్పుడు ఈమె దాదాపుగా ఆ తరం స్టార్ హీరోలందితో కలిసి సినిమాలు చేసింది..ఇక ప్రతి ఏడాది పుట్టుకొస్తున్న కొత్త హీరోయిన్స్ వల్ల హీరోయిన్ గా రోజా క్రేజ్ క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది..ఆ సమయం లో ఆమె తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసారు..MLA గా రెండు సార్లు తెలుగు దేశం పార్టీ నుండి పోటీ చేసి అప్పట్లో ఓడిపోయారు..ఆ తర్వాత ఆమె వైసీపీ పార్టీ లో చేరి రెండు సార్లు నగరి స్థానం నుండి MLA గా గెలుపొందిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇప్పుడు ఆమె మంత్రిగా కూడా కొనసాగుతున్నారు..ఇది కాసేపు పక్కన పెడితే అప్పట్లో ఈమె నిర్మాతగా ఒక సినిమా నిర్మించి భారీ స్థాయిలో నష్టపోయారు..ఈ సినిమా వల్ల రోజా గారు అప్పుల ఊబిలో చిక్కుకొని కుటుంబం ని పోషిచడం కూడా కష్టతరమైన పరిస్థితులను తెచ్చుకుంది..అలాంటి సమయం లో ఆమెకి ఊపిరి పోసింది జబర్దస్త్ అనే కామెడీ షో..ఈ షో ద్వారా ఆమె దాదాపుగా పదేళ్ల పాటు జడ్జిగా కొనసాగారు.
ఈ షో ద్వారానే ఆమె తన అప్పులన్నీ తీర్చుకొని వ్యక్తిగత జీవితం లో బలంగా నిలబడగలిగారు..ఈ షో నడుస్తున్న సమయం లోనే ఆమె రెండు సార్లు MLA గా గెలుపొందడమే కాకుండా..మంత్రి కూడా అయ్యారు..మంత్రి అయినా తర్వాత ఈమధ్యనే ఆమె జబర్దస్త్ షో మానేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇది ఇలా ఉండగా రోజా కి ప్రస్తుతం ఉన్న ఆస్తుల గురించి సోషల్ మీడియా లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది..ఆమె పెద్ద స్టార్ హీరోయిన్ మరియు రాజకీయ నాయకురాలు కాబట్టి ఆమెకి ఆస్తులు వందల కోట్లలో ఉంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు.
Also Read: The Warrior Collections: ‘ది వారియర్’ 7 డేస్ కలెక్షన్స్.. లేటెస్ట్ బాక్సాఫీస్ రిపోర్ట్స్ ఇవే
కానీ ఆమె ఎన్నికల సమయం లో ఆమె ఆస్తులను కేవలం 7 కోట్ల 38 లక్షల రూపాయిలు మాత్రమే అని నామినేషన్ అఫిడెట్ లో పొందుపర్చింది అట..ఆమెకి ఉన్న స్థిరాస్తుల విలువ కేవలం 4 కోట్ల 64 లక్షల రూపాయిలు మాత్రమేనని..చరాస్తుల విలువ అయితే కేవలం రెండు కోట్ల 74 లక్షల రూపాయిలు మాత్రమేనని తెలిపింది..అంతే కాకుండా తన భర్త 58 లక్షలు ఆస్తులున్నాయి అని..తన పిల్లల పేరిట 50 లక్షల రూపాయిలు ఫిక్సడ్ డిపాసిట్లు ఉన్నాయని ఈ సందర్భంగా పేర్కొంది అట రోజా..కానీ ఆమె MLA గా రెండు సార్లు గెలుపొందింది అంటే ఈ ఆస్తులు పెట్టుకొని గెలవడం అసాధ్యం అని ..MLA అవ్వడానికి కనీసం పది కోట్లు అయినా ఖర్చు అవుతుందని..రోజా తప్పుడు లెక్కలు చూపించిందంటూ ఆమె ప్రత్యర్థులు అప్పట్లో విమర్శలు కూడా చేసారు..ఆమె అసలైన ఆస్తుల మొత్తం కలిపి 300 కోట్ల రూపాయలకు తక్కువ ఉండదని సోషల్ మీడియా లో ప్రచారం అవుతుంది..ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ ఎవరికీ తెలియదు.
Also Read:Difference Between Baahubali and RRR: బాహుబలికి, ఆర్ఆర్ఆర్ కు మధ్య తేడా అదే.. అక్కడే తేడా కొట్టింది!