Fauji movie latest update: ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. దర్శకుడు సైతం ఈ సినిమాని చాలా కేర్ ఫుల్ గా తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ మూవీ స్టార్ట్ అయి సంవత్సరన్నార అవుతున్నప్పటికి ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ గాని, ఒక ఫోటో కానీ బయటికి రాలేదు. మరి ఎందుకని దర్శకుడు ఇంత గోప్యంగా ఈ సినిమా నుంచి త్రికరిస్తున్నాడు అనే ధోరణిలోనే మరికొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇప్పటివరకు హను రాఘవపూడి చేసిన సినిమాలన్నీ ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా మరొక ఎత్తుగా మారబోతుంది. కారణం ఏంటంటే ఇప్పటివరకు ఆయన ఏ స్టార్ హీరోని కూడా డైరెక్ట్ చేయలేదు.
మొదటిసారి ప్రభాస్ ను డైరెక్షన్ చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమాతో మరో పెను సంచలనాన్ని క్రియేట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. లవ్ స్టోరీలను అద్భుతంగా తెరకెక్కించగలడనే ఒక పేరును సంపాదించుకున్న హను రాఘవపూడి ఫౌజీ సినిమా యుద్ధం నేపథ్యంలో సాగుతుంది. కాబట్టి వార్ ఎపిసోడ్ ను కూడా చాలా హై టెక్నికల్ వాల్యూస్ తో చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది.
దీనికోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ సైతం పనిచేస్తున్నారట. అయితే ఫౌజీ సినిమా ఆ విషయంలో మాత్రం చాలా వరకు తేడా కొట్టే విధంగానే కనిపిస్తుందని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నప్పటికి ఇందులో సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉంటుందట. ప్రభాస్ ఇప్పటివరకు సిస్టర్ సెంటిమెట్ తో సినిమాలైతే చేయలేదు.
ప్రభాస్ కి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది తెలియాల్సి ఉంది. గతంలో హను రాఘవపూడి చేసిన ‘సీతారామం’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. అది కూడా ఆర్మీ బేస్డ్ సినిమాగానే రావడం ప్రేక్షకులను విశేషంగా అలరించడంతో మూవీ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ప్రభాస్ తో కూడా అలాంటి సినిమానే చేస్తున్నాడు. మరి ఈ సినిమాని కూడా సక్సెస్ ఫుల్ గా నిలుపుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…
