Sandeep Reddy Vanga: అనిమల్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో టాప్ డైరెక్టర్ అనే చెప్పాలి…అయితే కొంతమంది ఈ అనిమల్ సినిమా మీద నెగిటివ్ అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఇక ఈ అనిమల్ సినిమా మీద సంచలన దర్శకుడు వర్మ స్పందిస్తూ ఈ సినిమాని దర్శకుడు సందీప్ అద్భుతంగా తెరకెక్కించాడు.
తన కాళ్లని ఒకసారి ఫోటో తీసి పంపిస్తే వాటికి దండం పెట్టుకుంటాను అంటూ ట్వీట్ చేశాడు.ఇక ఇది చూసిన కొంతమంది మాత్రం రాంగోపాల్ వర్మ ఒకప్పుడు తీసిన శివ సినిమా కంటే అనిమల్ సినిమా తోపు సినిమా నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి గొప్ప డైరెక్టర్ సందీప్ లాంటి ఒక డైరెక్టర్ ని కాళ్ళ ఫోటో పంపు దండం పెట్టుకుంటా అనడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి అనిమల్ సినిమా చాలా సూపర్ హిట్ సినిమా అయినప్పటికీ కొంతమంది మాత్రం ఆ సినిమా మీద కావాలనే కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాంగోపాల్ వర్మ అభిమానులైతే సందీప్ రెడ్డి వంగ రామ్ గోపాల్ వర్మ కంటే గొప్ప డైరెక్టరా అంటూ సోషల్ మీడియా లో రచ్చ రచ్చ చేస్తున్నారు. నిజానికి వర్మ అలాంటి బోల్డ్ వ్యాఖ్యలు చాలాసార్లు చేశాడు. కానీ సందీప్ రెడ్డి విషయంలో మాత్రమే ఇలా వర్మ ఫ్యాన్స్ హంగామా చేయడం వెనుక కారణం ఏంటి అంటే సందీప్ వరుసగా హిట్లు కొడుతున్నాడు కాబట్టి అతన్ని చూసి ఓర్వలేని కొంతమంది సోషల్ మీడియాలో ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ ని వైరల్ చేస్తున్నారంటూ మరి కొంతమంది సినీ పెద్దలు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు…
అయితే సినిమా నచ్చి వర్మ అలా అనడంలో తప్పేముంది అంటూ మరి కొంతమంది సందీప్ కి ఫేవర్ గా మాట్లాడుతున్నారు. ఇక వర్మ పోస్ట్ మీద స్పందించిన సందీప్ వంగ మీలాంటి గొప్ప డైరెక్టర్ నా గురించి ఇలాంటి మాటలు మాట్లాడడం నిజంగా నా అదృష్టం అంటూ ఆయన పెట్టిన పోస్ట్ కి రీ ట్వీట్ చేశాడు. ఇక ఈ సినిమాతో సందీప్ ఇండియాలోనే టాప్ త్రీ డైరెక్టర్ల లో ఒకడిగా పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతానికి అనిమల్ సినిమా 500 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఇప్పటికి కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తుంది. ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంత వసూలు చేస్తుందనేది తెలియాల్సి ఉంది…