Pan India Movies: తెలుగు, హిందీ ప్రేక్షకులను కలిపి మెప్పించడం ఆంట ఈజీ కాదు

నిఖిల్ పరిస్థితి కూడా అంతే. కార్తికేయ 2 తో హిందీలో కూడా బ్లాక్ బస్టర్ అందుకొని, స్పై సినిమాతో రెండు భాషల ప్రేక్షకులను మెప్పించాలని చూసి, ఆఖరికి డిజాస్టర్ చవిచూశారు. అల్లు అర్జున్ పరిస్థితి పుష్ప తరువాత ఎలా ఉంటుందో చూడాలి.

Written By: Swathi, Updated On : August 18, 2023 11:36 am

Pan India Movies

Follow us on

Pan India Movies: బాహుబలి అనే ఒక్క సినిమా తెలుగు సినిమాలపై హిందీ వారికి ఉన్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది. ఇక రాజమౌళి.. ప్రభాస్.. ప్రపంచవ్యాప్తంగా.. ముఖ్యంగా బాలీవుడ్ లో సూపర్ స్టార్లు అయిపోయారు. ఇక అక్కడ మొదలైంది తెలుగు హీరోలకి, దర్శకులకి ప్యాన్ ఇండియా మార్కెట్ క్రేజ్.

దానికి తగ్గట్టే పుష్ప, కార్తికేయ 2 సినిమాలు కూడా తెలుగుకి మించి హిందీలో సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇక్కడ వరకు కథ బాగానే ఉన్నా.. జరగబోయే దాని గురించే అనేక సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాలకు మొదటి కారణం హీరో ప్రభాస్. ప్రభాస్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు. ఏ హీరో అభిమాని అయినా సరే ప్రభాస్ ని ప్రేమిస్తారు అన్నడంల సందేహం లేదు. ఒకరి జోలికి పోడు .అలానే అందరిని డార్లింగ్ డార్లింగ్ అంటూ కలుపుకొని పోతారు. తెలుగు ప్రేక్షకులు అయినా.. హిందీ ప్రేక్షకులు అయినా, ఆయన నటనకు ఫిదా కావలసిందే. కానీ అలాంటి హీరోకి ప్రస్తుతం హిట్లు లేకుండా సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురవుతున్నారు.

దానికి ముఖ్య కారణం పాన్ ఇండియా వలలో చిక్కుకోవడం. బాహుబలి నుంచి ప్రభాస్ కి తెలుగు ప్రేక్షకులే కాదు హిందీ ప్రేక్షకులను కూడా మెప్పించవలసిన బాధ్యత భుజంపై పడింది. తమ తమ నేతివిటికి తగ్గట్టు మంచి సినిమాలు తీసే దర్శకులు ఎంతోమంది ఉండొచ్చు. కానీ అన్ని భాషల ప్రేక్షకులను మెపించేలా సినిమాలు తీయగలిగే దర్శకులు, అలాంటి కథలు దొరకడం అంత ఈజీ కాదు. ఉదాహరణకి సాహో సినిమా హిందీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తీసినట్టు ఉంటుంది అందుకే తెలుగు ప్రేక్షకులకు ఎక్కలేదు. మరోపక్క ఆది పురుష్ సినిమా అటు తెలుగు ఇటు హిందీ కాకుండా పోయింది.

ఇక నిఖిల్ పరిస్థితి కూడా అంతే. కార్తికేయ 2 తో హిందీలో కూడా బ్లాక్ బస్టర్ అందుకొని, స్పై సినిమాతో రెండు భాషల ప్రేక్షకులను మెప్పించాలని చూసి, ఆఖరికి డిజాస్టర్ చవిచూశారు. అల్లు అర్జున్ పరిస్థితి పుష్ప తరువాత ఎలా ఉంటుందో చూడాలి.

మొత్తానికి తెలుగు, హిందీ ప్రేక్షకుల ఇద్దరినీ కలిపి మెప్పించాలి అంతే మాత్రం తప్పకుండా అది సులువైన పని మాత్రం కాదు. కథ, కథనం, దర్శకత్వం దీనికి తోడు ఆఖరికి నటి నటులు పర్ఫామెన్స్ కూడా ఫ్యాన్ ఇండియా లెవెల్ లో ఉండాలి. అంతెందుకు ఆఖరికి మ్యూజిక్ అలానే లిరిక్స్ కూడా అన్ని భాషల వారిని ఆకట్టుకునేలా ఉండాలి. అందుకే హీరోలకి ఫ్యాన్ ఇండియా మార్కెట్ రావడం అదృష్టం అని కొందరు భావిస్తూ ఉంటే, ప్యాన్ ఇండియా వల్లలో చిక్కుకుంటే ఇక అంతే సంగతి అనేది సినీ పండితులు భావిస్తున్నారు.