కరోనా సెకండ్ వేవ్ తో ప్రస్తుతం అంతా ఓటీటీలదే రాజ్యం అయిపోయింది, ఇన్నాళ్లు థియేటర్ల పై ఆధిపత్యం చూపించిన ఆ నలుగురికి ఇక చెక్ పడినట్టే అని సినిమా వాళ్లు కూడా అభిప్రాయ పడుతున్నారు. కాకపోతే, తమ సినిమాలను ఓటీటీల్లో విడుదల చేయడానికి మేకర్స్ మాత్రం ఒప్పుకోలేవడం లేదు. దాంతో రిలీజ్ అవ్వాల్సిన చిత్రాలు అన్నీ పోస్ట్ ఫోన్ అయ్యాయి.
ఈ కరోనా వైరస్ నేపథ్యంలో మూతపడిన థియేటర్లు మళ్ళీ ఎప్పుడు తెరుచుకుంటాయో అని ఎదురుచూస్తున్నారు చిన్న నిర్మాతలు. ఒక పక్క జూన్ నాలుగో వారం నాటి నుంచి దేశంలో అన్ని థియేటర్స్ ఓపెన్ అవుతాయని అంటున్నారు. మరోపక్క లాక్ డౌన్ మళ్ళీ పెట్టక ముందే.. అన్ని నగరాల్లో ఎవ్వరికి వారే లాక్ డౌన్ విధించుకుంటున్నారు.
మాల్స్ తో పాటు చాలామంది థియేటర్లు కూడా దాదాపుగా మూత పడ్డాయి. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితులలో థియేటర్లకు గ్రీన్ సిగ్నల్ ఎంతవరకు ఇస్తారు. అందుకే థియేటర్ల ఓపెనింగ్ పై కూడా ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఉంది. పీవీఆర్ సినిమాస్ వాళ్లు థియేటర్లను తెరవడానికి ప్లాన్ చేశారు.
కానీ సోషల్ డిస్టెన్సింగ్ ఏ విధంగానూ థియేటర్స్ లో పాటించడం అనేది సాధ్యం కాదని తేల్చారు. అయినా ఈ థియేటర్స్ ఓపెన్ చేసినా ఈ పరిస్థితుల్లో సినిమాలు చూడటానికి ఎంతమంది రెడీగా ఉంటారనేది మాత్రం సందేహమే. కాబట్టి, చిన్న నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసుకోవడం ఉత్తమైనపని.