Sudigali Sudheer: బుల్లితెర సూపర్ స్టార్ సుధీర్ తన కెరీర్ చేజేతులా నాశనం చేసుకుంటున్నాడన్న వాదన వినిపిస్తోంది. దూరపు కొండలు నునుపు అన్నట్లు లేని దాని కోసం ట్రై చేసి ఉన్నదాన్ని కోల్పోతున్నాడని అంటున్నారు. సుధీర్ మల్లెమాల సంస్థకు దూరం కావడం తప్పుడు నిర్ణయంగా అభివర్ణిస్తున్నారు. అయితే సుధీర్ నిర్ణయాల వెనుక ఓ స్టార్ యాంకర్ ఉన్నారట. ఆయన ఎవరో కాదు ఓంకార్. సుధీర్ ఈటీవీని వీడటానికి ఆయనే కారణమంటూ వార్తలు వస్తున్నాయి. సుధీర్ కి ఏవేవో ఆశలు చూపి ఓంకార్ స్టార్ మా వైపుకు మళ్లించారనే ఆరోపణ వినిపిస్తుంది.

ఒక ఏడాది క్రితం వరకు ఈటీవీలో సుధీర్ దే హవా. ఆ ఛానల్ లో ప్రసారమయ్యే టాప్ రేటెడ్ షోస్ లో సుధీర్ ఉన్నాడు. జబర్దస్త్, ఢీ, కొత్తగా ప్రారంభమైన శ్రీదేవి డ్రామా కంపెనీ బుల్లితెరను ఏలేస్తుండగా, సుధీర్ యాంకర్ గా, కమెడియన్ గా రఫ్ ఆడించాడు. బుల్లితెర స్టార్ గా ఎదిగాడు. జబర్దస్త్ ఆయనకు గుర్తింపు తెస్తే ఢీ రియాలిటీ షో స్టార్ ని చేసింది. సుధీర్ యాంకర్ గా ఉన్న ఢీ సీజన్స్ రేటింగ్ లో దుమ్మురేపాయి.
ఇక ఈటీవీలో ఎంటర్టైన్మెంట్ అంటే సుధీర్ దే అన్నంతగా ఆయన దున్నేశారు. అయితే క్రమంగా సుధీర్ మల్లెమాల సంస్థకు, ఈటీవికి దూరం అవుతూ వచ్చాడు. మొదట ఢీ రియాలిటీ షో యాంకర్ గా తప్పుకున్నారు. తర్వాత తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ నే వదిలేశాడు. ఫైనల్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకరింగ్ బాధ్యతలు కూడా వదిలేశాడు. పూర్తిగా ఈటీవికి దూరమయ్యాడు. దీంతో సుధీర్ బుల్లితెరపై కనిపించడం అరుదైపోయింది.

శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి వైదొలిగిన వెంటనే స్టార్ మా లో సూపర్ సింగర్ జూనియర్ యాంకర్ గా చేశాడు. ఆ షో ముగియడంతో స్టార్ మా లో కూడా ఆయన కనిపించడం లేదు. కాగా ఈటీవీని సుధీర్ వీడటం వెనుక యాంకర్ ఓంకార్ ఉన్నాడట. భారీ రెమ్యునరేషన్ కెరీర్ ఆశచూపి స్టార్ మాకి లాక్కెళ్లాడట. ఆయన మాటలు నమ్మి ఈటీవిని వదిలేసిన సుధీర్ భారీగా నష్టపోతున్నట్లు సమాచారం. ఒకప్పటి ఆదాయం ఆయనకు లేదట. ఓంకార్ ట్రాప్ లో చిక్కుకున్న సుధీర్ కెరీర్ నాశనం చేసుకున్నాడని అంటున్నారు. మరి ఇప్పటికైనా మేల్కొని తిరిగి ఈటీవికి వస్తే స్థిరమైన కెరీర్ సొంతం అవుతుందంటున్నారు.