https://oktelugu.com/

Naga Chaitanya: అసలు ఎందుకు బ్రతికి ఉన్నాను అని బాధ వేస్తుంది.. నాగ చైతన్య ఎమోషనల్ కామెంట్స్ వైరల్

వెంకట్ ప్రభు మార్కు సినిమాలాగానే ఉందని, నాగ చైతన్య చాలా కొత్తగా కనిపిస్తున్నాడు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజెన్స్. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో టాప్ స్థానం లో ట్రెండ్ అవుతూ ఉంది.

Written By:
  • Vicky
  • , Updated On : May 8, 2023 / 05:24 PM IST

    Naga Chaitanya

    Follow us on

    Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కస్టడీ’ 12 వ తారీఖున తెలుగు మరియు తమిళం బాషలలో ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా, తమిళ సీనియర్ హీరోలు అరవింద్ గో స్వామి మరియు శరత్ కుమార్ లు ముఖ్యపాత్రలు పోషించారు. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

    వెంకట్ ప్రభు మార్కు సినిమాలాగానే ఉందని, నాగ చైతన్య చాలా కొత్తగా కనిపిస్తున్నాడు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజెన్స్. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో టాప్ స్థానం లో ట్రెండ్ అవుతూ ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిన్ననే జరిగింది.మూవీ యూనిట్ మొత్తం మాట్లాడిన మాటలు అభిమానుల్లో ఈ చిత్రం పై మరింత అంచనాలు పెంచేలా చేసింది.

    ఇది ఇలా ఉండగా రీసెంట్ గా నాగ చైతన్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో సోషల్ మీడియా లో వచ్చే కామెంట్స్ పై స్పందించాడు.ఆయన మాట్లాడుతూ ‘నా సినిమా విడుదలైనప్పుడు సోషల్ మీడియా లో వచ్చే రివ్యూస్ చూస్తూ ఉంటాను, పాజిటివ్ గా ఉన్నవి బాగా ఎంజాయ్ చేస్తాను, నెగటివ్ కామెంట్స్ ని కూడా నేను స్పోర్టివ్ గానే తీసుకుంటాను, కానీ కొన్ని కామెంట్స్ చూసినప్పుడు మాత్రం చాలా బాదేస్తాది. అవి చూసినప్పుడు నేను ఎందుకు బ్రతికి ఉన్నాను రా బాబు అని అనుకునేవాడిని’ అంటూ ఎమోషనల్ గా కామెంట్ చేసాడు నాగ చైతన్య. అయితే కస్టడీ చిత్రం తో నన్ను అభిమానించే వాళ్ళని మాత్రమే కాదు, నన్ను ద్వేషించే వాళ్ళ చేత కూడా శబాష్ అనిపించుకుంటాను అనే నమ్మకం ఉంది అంటూ నాగ చైతన్య చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.