Iswarya Menon: మొదట్లో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో కనిపించింది. కెరియర్ ప్రారంభంలో సినిమాలలో సహాయక పాత్రలలో నటించి ఆ తర్వాత హీరోయిన్ గా కూడా అవకాశం అందుకుంది. తెలుగు తో పాటు తమిళ్లో కూడా వరుస సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుతుంది. వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్న చిన్నారి నాట్యమయురి ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా బాగా గుర్తింపు తెచ్చుకుంది. నటనపై తనకున్న ఇష్టంతో సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. తన అందమైన చిరునవ్వుతో, చూడ చక్కని రూపంతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. తన అందంతో సినిమాలలో నటించి వెండి తెరపై మాయ చేసింది. కెరియర్ ప్రారంభంలో ఈ బ్యూటీ సినిమాలలో సహాయక పాత్రలలో నటించింది. ఆ తర్వాత క్రమక్రమంగా హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. తక్కువ సమయంలోనే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది. ఈ బ్యూటీ తెలుగుతోపాటు తమిళ్లో కూడా నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. కానీ ఈమె నటించిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి.
నెమ్మదిగా ఈమెకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. టాలీవుడ్ లో ఈ చిన్నది తనకు సరైన బ్రేక్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంది. సోషల్ మీడియాలో మాత్రమే నిత్యం గ్లామర్ ఫోటోలతో సందడి చేస్తుంది. ఈ హీరోయిన్ మరెవరో కాదు ఐశ్వర్య మీనన్. ఐశ్వర్య మీనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె తమిళనాడు రాష్ట్రంలో ఈరోడ్ ప్రాంతంలో జన్మించింది. ఇన్స్ట్రుమెంటేషన్ లో ఈమె ఇంజనీరింగ్ లో చదువు పూర్తి చేసింది. నటనపై తనకు చాలా ఇష్టం ఉండడంతో సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. కాదలిల్లు సోధపువదు ఎప్పడి అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కెరియర్ ప్రారంభంలో ఈ బ్యూటీ అంతగా అవకాశాలను అందుకోలేకపోయింది. ఈ క్రమంలో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో కూడా నటించింది. లవ్ ఫెయిల్యూర్ సినిమాతో హీరోయిన్ గా మారింది.
దాదాపు 10 ఏళ్లు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో అలరించిన ఈ చిన్నది ఆ తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన స్పై సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటించిన అలరించింది. కానీ స్పై సినిమా బాక్సాఫీస్ దగ్గర పరాజయం పొందడంతో ఈమెకు అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. తెలుగులో ఈమె నటించిన సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈమెకు తెలుగులో అవకాశాలు క్రమక్రమంగా తగ్గిపోయాయి. ప్రస్తుతం ఐశ్వర్య మీనన్ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రాక సైలెంట్ గా ఉండిపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఐశ్వర్య మీనన్ రెగ్యులర్గా తన ఫోటోషూట్స్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
View this post on Instagram