Who is the number one director: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికి సాధ్యం కానీ రీతిలో గొప్ప సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న దర్శకులలో రాజమౌళి మొదటి స్థానం లో ఉన్నాడు. ఇక బాలీవుడ్ డైరెక్టర్లు సైతం పాన్ ఇండియా సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు… నితీష్ తివారీ లాంటి దర్శకుడు గతంలో అమీర్ ఖాన్ తో చేసిన ‘దంగల్’ సినిమా గొప్ప విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. ప్రస్తుతం ఆయన రామాయణం అంటూ మరో సినిమాని స్టార్ట్ చేశాడు. అయితే ఈ సినిమా హిందువుల పవిత్ర గ్రంథం అయిన రామాయణాన్ని బేస్ చేసుకుని తర్కెక్కుతూ ఉండటం విశేషం… ఇందులో రణ్బీర్ కపూర్ రాముడిగా నటిస్తుంటే, సాయి పల్లవి సీతకి నటిస్తోంది. కన్నడ స్టార్ హీరో యశ్ రావణాసూరుడిగా నటిస్తున్నాడు…ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో నితీష్ తివారీ మరోసారి తన స్టామినా ఏంటో చూపించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక రాజమౌళి చేసిన ‘బాహుబలి 2’ సినిమా 1800 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టింది. అయినప్పటికి నితీష్ తివారీ రికార్డును బ్రేక్ చేయలేకపోయాడు.
కాబట్టి ఇండియాలో ప్రస్తుతం నితీష్ తివారీ నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ఇక రాబోయే సినిమాలతో వీళ్ళిద్దరిలో ఎవరు సూపర్ సక్సెస్ ని సాధిస్తారు అనేది తెలియాల్సి ఉంది…ఇక నితీష్ తివారీ సినిమాలు చాలా సెన్సిబుల్ గా ఉంటాయి. రాజమౌళి సినిమాలు విజువల్ వండర్ గా తెరకెక్కిస్తు ఉంటాడు.
ఇద్దరి సినిమాలు డిఫరెంట్ పంథా లో సినిమాలు రావడం అనేది మనం చూశాం…ఇక వీళ్ళిద్దరిలో ఎవరు టాప్ డైరెక్టర్ గా ఎదుగుతారు. వీళ్లను కాదని ఇంకా వేరే దర్శకులు ఎవరైనా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసే సినిమాలను తీస్తారా అనే అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి…
ప్రస్తుతం వీళ్లిద్దరితో పాటు సుకుమార్, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకులు సైతం బ్లాక్ బాస్టర్ సక్సెస్ లను సాధించడంలో ముందు వరుసలో ఉన్నారు. ఇక వీళ్ళు సైతం ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి. మరో రెండు సంవత్సరాలు గడిస్తే గాని వీళ్లలో నెంబర్ వన్ డైరెక్టర్ ఎవరు అనేది చెప్పడం చాలా కష్టంతో కూడుకున్న పని అనే చెప్పాలి…
