YouTuber Anvesh: ఒకప్పుడు ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)(Naa Anveshana) పై ప్రేక్షకుల్లో చాలా మంచి అభిప్రాయం ఉండేది. ఎందుకంటే ఎక్కడో పల్లెటూరు నుండి వచ్చిన కుర్రాడు, ప్రపంచం మొత్తం తిరుగుతూ, ప్రతీ దేశం లోని సంస్కృతి, అక్కడి మనుషుల అలవాట్లు , వాళ్ళు అనుసరించే నాగరికత, ఇలా అన్నిటినీ కవర్ చేస్తూ ఎన్నో వేల వీడియోస్ చేశారు. అందుకే అతని యూట్యూబ్ ఛానల్స్ ని పాతిక లక్షల మందికి పైగా అనుసరిస్తున్నారు . వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి, మెగాస్టార్ చిరంజీవి వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. అంతే కాకుండా ఈ ఏడాది లో ఆయన బెట్టింగ్ యాప్స్ పై చేసిన అలుపెరగని పోరాటం కి కూడా జనాలు మద్దతు తెలిపారు. కానీ ఆ సమయం లో ఆయన మాట్లాడిన భూతులపై నెటిజెన్స్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మనం నిజ జీవితం లో కూడా ఎప్పుడూ వినని బూతులతో చెవుల్లో నుండి రక్తం వచ్చేలా అతను తనకి నచ్చని వాళ్ళని తిట్టిన సందర్భాలు ఉన్నాయి. జనాల నుండి వస్తున్నా వ్యతిరేకతను గమనించిన అన్వేష్, తన వీడియోస్ లో కొంతకాలం ఎలాంటి బూతు లేకుండా చూసుకున్నాడు . కానీ ఈమధ్య కాలం లో ఆయన వీడియోస్ కి బాగా వ్యూస్ తగ్గిపోయాయి. అందుకే మళ్లీ కాంట్రవర్సి లోకి దూరాలని చూసాడు. శివాజీ ని, గరికపాటి ని అనరాని మాటలు అన్నాడు. వాళ్ళతో ఇతను ఆగిపోలేదు. హిందీ దేవుళ్లను కూడా అవమానించడం కూడా జరిగింది. సీత దేవి, ద్రౌపది గురించి ఇతను చేసిన వ్యాఖ్యలను మేము చెప్పడానికి కూడా సిగ్గు పడుతున్నాం. అంతటి దారుణమైన వ్యాఖ్యలవి. ఈ వ్యాఖ్యలపై విశ్వ హిందూ పరిషత్ సంస్థ రెస్పాన్స్ ఇచ్చింది. హిందూ దేవతలు , భారత మహిళల వస్త్రాధారణ పై అన్వేష్ చాలా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసాడని తక్షణమే అతనిపై చర్యలు తీసుకోవాలంటూ VHP ప్రతినిధులు గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
మరి విదేశాల్లో చక్కర్లు కొడుతున్న అన్వేష్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారా లేదా?, ఇండియా కి వస్తే కచ్చితంగా అన్వేష్ కి జనాల చేతుల్లో చెప్పు దెబ్బలు ఉంటాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు. అంత కోపం మీద ఉన్నారు. నిన్న చేసిన వ్యాఖ్యల తర్వాత అతనికి ఇన్ స్టాగ్రామ్ మరియు యూట్యూబ్ లో లక్షల మంది అన్న ఫాలో అయ్యారు. ఇలా నోటి దూలతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడిన అన్వేష్ పై గతం లో చాలా కేసులు నమోదు అయ్యాయి. కానీ ఇప్పటి వరకు పోలీసులు అతన్ని ఏమి చేయలేకపోయారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకుంటే టాప్, అన్వేష్ ని ఎవ్వరూ ఏమి చేయలేరని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు.