
Waltair Veerayya Collections: సంక్రాంతి కానుకగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఎంత పెద్ద భారీ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే..ఆకలి తో ఉన్న మెగా ఫ్యాన్స్ కి భుక్తాయాసం వచ్చేలా చేసింది ఈ చిత్రం.మెగాస్టార్ కమర్షియల్ సినిమా చేస్తే ఏ రేంజ్ లో ఉంటుందో నేటి తరం యువకులకు కూడా మరోసారి అర్థం అయ్యేలా చేసింది ఈ సినిమా..ఇప్పటికే 140 కోట్ల రూపాయిల షేర్ మార్కుకి దగ్గరగా వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకెళ్తుంది.
సినిమా విడుదలై నెల రోజులు అవుతుంది, ఏమద్యలో ఎన్నో కొత్త సినిమాలు వచ్చాయి, కానీ ‘వాల్తేరు వీరయ్య’ కలెక్షన్స్ కి మాత్రం అడ్డుకట్ట వెయ్యలేకపోయ్యాయి, ఆడియన్స్ కి ఇప్పటికీ ఈ సినిమానే మొదటి ఛాయస్ గా నిలిచింది, అందుకు ఉదాహరణ రీసెంట్ గా విడుదలైన కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ మొదటి రోజు వసూళ్లను తీసుకుందాం.
‘భింబిసారా’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వచ్చిన ఈ సినిమాకి మొదటి రోజు వచ్చిన వసూళ్లు అంతంత మాత్రమే..చాలా ప్రాంతాలలో ఈ సినిమాకి నిన్న ‘వాల్తేరు వీరయ్య’ కంటే తక్కువ ఆక్యుపెన్సీలు రావడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది..ముఖ్యంగా ఉత్తరాంధ్ర మరియు నైజాం వంటి ప్రాంతాలలో ‘అమిగోస్’ కంటే ‘వాల్తేరు వీరయ్య’ ఆక్యుపెన్సీలు ఎక్కువ ఉన్నాయి.

దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి ఈ వీకెండ్ కూడా అదిరిపొయ్యే కలెక్షన్స్ వస్తాయి అని అర్థం అవుతుంది..ఓటీటీ విడుదల తేదీ కూడా ఇచ్చేసిన ఒక సినిమాకి ఇప్పటికీ రన్ వస్తుందంటే మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు..ఆయన రేంజ్ సినిమా ఇంకా పడలేదు, ఒకవేళ పడితే ఇండియాలోనే టాప్ 5 గ్రాస్ సాధించిన సినిమాలలో ఒకటిగా తన సినిమా పెట్టడం పెద్ద కష్టమేమి కాదు..ఆరోజు కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.
