Varalakshmi Sarathkumar : వరలక్ష్మీ శరత్ కుమార్ కాబోయే భర్తకు ఇదివరకే పెళ్లి జరిగిందా?

మొదటి భార్యతో విడిపోయిన అనంతరం ఆయనకు వరలక్ష్మీతో పరిచయం ఏర్పడింది అని.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి.. ఇప్పుడు నిశ్చితార్థం వరకు వెళ్లింది అని తెలుస్తోంది. మొత్తం మీద వరలక్ష్మీకి కాబోయే భర్తకు ఇప్పటికే పెళ్లి జరిగింది అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. మరి పెళ్లి తర్వాత ఈ అమ్మడు సినిమాల్లో నటిస్తుందో లేదో చూడాలి.

Written By: NARESH, Updated On : March 4, 2024 1:21 pm
Follow us on

Varalakshmi Sarathkumar : నెగటివ్ పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది వరలక్ష్మీ శరత్ కుమార్. ఈమె నటించిన యశోద సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో మరింత పాపులర్ అయింది ఈ నటి. తమిళంలోనే కాదు ఈమెకు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే తమిళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి ప్రస్తుతం విలన్ పాత్రల్లో ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ అందాల భామ.

తమిళంలో ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించినా.. ఆ పాత్రలతో పెద్దగా పేరు రాలేదు. అంతేకాదు ఆ సినిమాలు ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోలేదు. దీంతో ఈ అమ్మడు నెగటివ్ పాత్రలతో ఇరగదీస్తుంది. ఇలా కెరీర్ పరంగా ఫుల్ బిజీ అయిపోయిన ఈ నటి.. ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండానే ఉంది. అయితే గతంలో హీరో విశాల్ తో ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలపై క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ అమ్మడు ముంబైకి చెందిన నికోలయ్ సచ్ దేవ్ అనే ఆర్ట్ గ్యాలరీ ఓనర్ తో ఘనంగా నిశ్చితార్థం జరుపుకుంది.

వీరి నిశ్చితార్థం ముంబైలో కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది. వీరిద్దరికి దాదాపు 14 సంవత్సరాల నుంచి పరిచయం ఉందని టాక్. అయితే ఈమె పెళ్లి చేసుకోబోయే నికోలయ సచ్ దేవ్ గురించి ఓ వార్త వైరల్ గా మారింది. ఆయనకు ఇది మొదటి వివాహం కాదని.. ఇదివరకే పెళ్లి జరిగింది అంటూ తెలుస్తోంది. కానీ భార్యతో విడిపోయిన తర్వాత వరలక్ష్మీతో పెళ్లికి సిద్దమయ్యారని టాక్. ఇతని భార్య కవిత సచ్ దేవ్ ఒక మోడల్. ఫ్యాషన్ రంగంలో కొనసాగుతోంది. ఇక వీరిద్దరి మధ్య విబేధాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారని టాక్.

మొదటి భార్యతో విడిపోయిన అనంతరం ఆయనకు వరలక్ష్మీతో పరిచయం ఏర్పడింది అని.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి.. ఇప్పుడు నిశ్చితార్థం వరకు వెళ్లింది అని తెలుస్తోంది. మొత్తం మీద వరలక్ష్మీకి కాబోయే భర్తకు ఇప్పటికే పెళ్లి జరిగింది అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. మరి పెళ్లి తర్వాత ఈ అమ్మడు సినిమాల్లో నటిస్తుందో లేదో చూడాలి.