Trivikram and Allu Arjun : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న హీరోలు, దర్శకులు పాన్ ఇండియా బాట పట్టి ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఏ స్టార్ డైరెక్టర్ అయినా కూడా పాన్ ఇండియాలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇక మాటల మాంత్రికుడి గా మంచి గుర్తింపు సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం ప్రస్తుతం అల్లు అర్జున్ తో చేస్తున్న సినిమా విషయంలో పాన్ ఇండియాకు తగ్గట్టుగా స్క్రిప్ట్ రాసుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా సక్సెస్ అవ్వడం అనేది అటు అల్లు అర్జున్ కి ఇటు త్రివిక్రమ్ ఇద్దరికి చాలా కీలకమనే చెప్పాలి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కి దర్శకుడిగా చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతున్నవే కావడం విశేషం…అయితే ఇంతకుముందు చేసిన ‘గుంటూరు కారం’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయనతో సినిమాలు చేయడానికి కొంతమంది స్టార్ హీరోలు సైతం భయపడిపోతున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది అంటూ వార్తలైతే వస్తున్నాయి. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయడంలో త్రివిక్రమ్ చాలా బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం వీళ్లిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ఖైదీ సినిమాకి రీమేక్ వెర్షన్ గా వస్తోంది అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి అలాంటి కథతోనే త్రివిక్రమ్ అల్లు అర్జున్ ని పాన్ ఇండియా లెవెల్లో చాలా కొత్తగా చూపించే ప్రయత్నమైతే చేస్తున్నారట. ఇక త్రివిక్రమ్ ఖైదీ సినిమాను బేస్ చేసుకొని కథ రాసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే అల్లు అర్జున్ కు కూడా ఆ కథ బాగా నచ్చిందట. అందులో భారీ ఎలివేషన్స్, ఎమోషన్స్ తో కూడిన డ్రామా ను ప్లే చేయబోతున్నట్లుగా కూడా వార్తలయితే వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందంటూ ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయాలనైతే తెలియజేస్తున్నారు. ఇక తొందర్లోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి. మరి అన్ని అనుకునేట్టుగా కుదిరితే ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యం లో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి పుష్ప 2 సినిమాతో భారీ పెను ప్రభంజనాన్ని సృష్టించిన అల్లు అర్జున్ ఈ సినిమాతో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాడు. తద్వారా పాన్ ఇండియాలో ఆయన పొజిషన్ ఏంటి అనేది తెలియాలి అంటే ఈ సినిమా సక్సెస్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది…చూడాలి మరి త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చి సూపర్ సక్సెస్ లను సాధించాయి…మరి ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారు అనేది తెలియాల్సి ఉంది…