Balayya and NTR : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ మంచి క్రేజ్ ను క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ హీరోలకైతే చాలా మంచి గుర్తింపైతే ఉంది. నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఇప్పుడున్న జూనియర్ ఎన్టీఆర్ వరకు ప్రతి ఒక్క హీరో కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుంటు ముందుకు సాగుతున్న వాళ్లే కావడం విశేషం…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. వాళ్ళు చేసిన ప్రతి సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లినవే కావడం విశేషం… మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం వాళ్ల నుంచి వస్తున్న సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నప్పటికి ఫ్యామిలీ గొడవల వల్ల జూనియర్ ఎన్టీఆర్, బాలయ్య బాబు ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చిన విషయాలైతే చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. మరి వీళ్ళ మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయి. గత కొద్ది రోజుల క్రితం వీళ్ళు చాలా బాగా కలిసి మెలిసి ఉన్నారు. మరి మధ్యలో బాలయ్య బాబుకి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి. అయితే చిన్న చిన్న మనస్పర్ధలతో స్టార్ట్ అయిన వీళ్ళ గొడవలు ఇప్పుడు ఒకటికి ఒకరు ఎదురుపడిన సరే పలకరించుకోలేనంత పెద్ద గొడవలుగా మారిపోయిన విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది. బాలయ్య బాబుకి పద్మభూషణ్ అవార్డు వచ్చిన నేపధ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కంగ్రాట్స్ చెబుతూ ఒక ట్వీట్ అయితే చేశాడు. కానీ బాలయ్య దానికి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు… అంటే జూనియర్ ఎన్టీఆర్ బాలయ్యతో మాట్లాడాలని ప్రయత్నం చేసినప్పటికి బాలయ్య బాబు మాత్రం వాళ్లతో మాట్లాడే ప్రసక్తే లేదు అన్నట్టుగా తన మొండి వైఖరిని తెలియబరుస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు ఒకవైపు ఉంటే నందమూరి ఫ్యామిలీ మొత్తం మరొకవైపు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి బాలయ్యకు జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య విబేధాలు రావడానికి కారణం ఏంటి అంటే జూనియర్ ఎన్టీఆర్ గత కొన్ని రోజుల నుంచి బాలయ్య బాబు చంద్రబాబుతో సరిగ్గా కలవడం లేదు.
టిడిపి పార్టీ తరపున జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి మద్దతు తెలుపలేకపోవడంతో ఆయనను పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది. అలాగే అసెంబ్లీ సాక్షిగా బాలయ్య చెల్లెలు అయిన భువనేశ్వరిని ఉద్దేశించి వల్లభనేని వంశీ, కొడాలి నాని కొన్ని ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు.
దానిమీద కూడా జూనియర్ ఎన్టీఆర్ వాళ్ల మీద ఫైర్ అవుతూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అలాగే చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్ కి స్కిల్ డెవలప్ మెంట్ ముందు జైల్లో ఉన్నప్పుడు చాలామంది అతన్ని పరామర్శించడానికి వచ్చారు. కానీ నందమూరి కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ లు మాత్రం రాకపోవడంతో బాలయ్య బాబుకి వాళ్ళ మీద ద్వేషం మరింత పెరిగిపోయినట్టుగా తెలుస్తోంది.
ఇక అప్పటి నుంచి వాళ్లతో అసలు మాట్లాడేది లేదు అన్నట్టుగా బాలయ్య మొండి వైఖరిని పాటిస్తూ ముందుకు సాగుతున్నాడు. మరి ఫ్యూచర్ లో అయిన వీళ్ళ మధ్య మాటలు కలుస్తాయా లేదా అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…