https://oktelugu.com/

Aarthi Agarwal: ఆర్తి అగర్వాల్ కి ఆ గతి పట్టడానికి కారణం త్రివిక్రమా??

Aarthi Agarwal: టాలీవుడ్ టాప్ స్టార్ డైరెక్టర్స్ లో ఒక్కరు త్రివిక్రమ్ శ్రీనివాస్..రచయితా గా కెరీర్ ని ప్రారంభించిన ఈయన ఆరోజుల్లో ప్రముఖ దర్శకుడు విజయ్ భాస్కర్ కోసం చాలా కథలు రాసాడు..వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు అన్ని కూడా ఆల్ టైం క్లాసిక్ హిట్స్ గా నిలిచాయి..వాటిల్లో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన నువ్వు నాకు నచ్చావ్ అనే సినిమా గురించి..అప్పట్లో ఈ సినిమా ఒక్క ప్రభంజనం అనే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 28, 2022 / 01:06 PM IST

    Aarthi Agarwal

    Follow us on

    Aarthi Agarwal: టాలీవుడ్ టాప్ స్టార్ డైరెక్టర్స్ లో ఒక్కరు త్రివిక్రమ్ శ్రీనివాస్..రచయితా గా కెరీర్ ని ప్రారంభించిన ఈయన ఆరోజుల్లో ప్రముఖ దర్శకుడు విజయ్ భాస్కర్ కోసం చాలా కథలు రాసాడు..వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు అన్ని కూడా ఆల్ టైం క్లాసిక్ హిట్స్ గా నిలిచాయి..వాటిల్లో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన నువ్వు నాకు నచ్చావ్ అనే సినిమా గురించి..అప్పట్లో ఈ సినిమా ఒక్క ప్రభంజనం అనే చెప్పాలి..అద్భుతమైన కుటుంబ కథ తో కామెడీ మరియు సెంటిమెంట్ రెండిటిని సమపాళ్ళుగా చేసుకొని త్రివిక్రమ్ ఈ సినిమా కథని అత్యద్భుతంగా తీర్చి దిద్దారు..ఈ క్లాసిక్ సినిమా టీవీ లో ఇప్పుడు వచ్చినా కూడా అతుక్కుపొయ్యి చూస్తారు ప్రేక్షకులు..ఆ స్థాయిలో ఈ సినిమా జనాలకి కనెక్ట్ అయ్యింది..ఈ సినిమాలో వెంకటేష్ ఎంత అద్భుతంగా నటించాడో..ఆయనతో సమానంగా హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కూడా అంతే అద్భుతంగా నటించింది..వీళ్లిద్దరి మధ్య వచ్చే సన్నీవేశాలన్ని ప్రేక్షకులకు చూడముచ్చటగా ఉంటుంది.

    Aarthi, Venkatesh

    Also Read: Samantha Career In Danger: ప్రమాదం లో పడిన సమంత కెరీర్.. బయపడిపోతున్న నిర్మాతలు

    అయితే ఆర్తి అగర్వాల్ ని హీరోయిన్ గా తీసుకునే ముందు చాలా హై డ్రామానే నడించింది అని చెప్పొచ్చు..ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష ని తీసుకుందాం అనుకున్నారు..అప్పట్లో ఈమె డేట్స్ కోసం చాలా కష్టపడ్డారు దర్శక నిర్మాతలు..కానీ డేట్స్ సర్దుబాటు కాలేదు..ఇక ఎవరిని తీసుకోవాలా అని డైరెక్టర్ విజయ్ భాస్కర్ తల బద్దలు కొట్టుకొని ఆలోచిస్తున్న సమయం లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘ఈ సినిమాకి కొత్త అమ్మాయిని తీసుకుంటే చాలా బాగుంటుంది’ అని తన అభిప్రాయం ని విజయ్ భాస్కర్ ముందు పెట్టాడు త్రివిక్రమ్..విజయ్ భాస్కర్ కూడా బాగా ఆలోచించి త్రివిక్రమ్ చెప్పిందే కరెక్ట్ అని డిసైడ్ అయ్యి ముంబై మోడల్ ఏజెన్సీల చుట్టూ కొత్త హీరోయిన్ కోసం వెతుకులాడడం మొదలు పెట్టారు..ఆలా ఒక్క మోడల్ ఏజెన్సీ లో ఆర్తి అగర్వాల్ ఫోటో ని చూసాడు త్రివిక్రమ్ శ్రీనివాస్..ఎవరు ఈ అమ్మాయి ఇంత బాగుంది..ఇంతకు ముందు ఏమైనా ఇక్కడ సినిమాలు చేసిందా అని అడిగారు..’బాలీవుడ్ లో కేవలం ఒక్క సినిమా మాత్రమే చేసింది..ఆ సినిమా పెద్దగా ఆడలేదు..ఇక ఆ తర్వాత ఆ అమ్మాయి న్యూయార్క్ కి వెళ్ళిపోయింది..మళ్ళీ సినిమాల్లో నటిస్తుందో లేదో తెలియదు ‘ అంటూ చెప్పుకొచ్చారు ఆ మోడల్ ఏజెన్సీ వాళ్ళు..ఇక ఆ తర్వాత న్యూయార్క్ లో ఆర్తి అగర్వాల్ ఆచూకీ ని కనిపెట్టడం కోసం నానా తంటాలు పడ్డారు త్రివిక్రమ్ మరియు విజయ్ భాస్కర్..అయితే ఒక్క రోజు వెంకటేష్ అన్నయ్య సురేష్ బాబు వద్ద కి వెళ్లి తమకి ఉన్న సమస్య మొత్తం చెప్పుకోగా ఆయన న్యూయార్క్ లో ఉన్న తన స్నేహితులను కాంటాక్ట్ చేసి మొత్తానికి ఆర్తి అగర్వాల్ ఆచూకి కనిబెట్టారు..ఇక ఆ తర్వాత ఆమెని ఒప్పించి ఈ సినిమా చెయ్యడం..అది భారీ సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం..ఆర్తి అగర్వాల్ రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోవడం అన్ని చకచకా జరిగిపోయాయి.

    Aarthi Agarwal

    Also Read: Pawan Kalyan Bus Yatra: ఏపీలో పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు అసలు కారణం ఇదే.. యాత్రలో చెప్పే అంశాలివేనా..?
    Recommended Videos



    Tags