Posani Krishna Murali: జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ వపన్ కల్యాణ్ పై సినీనటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి చేసిన విమర్శలకు అందరు ఆశ్చర్యపోయారు. సాటి నటుడు అనే సానుభూతి లేకుండా వ్యక్తిగత విమర్శలకు పూనుకోవడం వెనుక పెద్ద దుమారమే రేగింది. సినీ పరిశ్రమలో చాలా మంది పవన్ కల్యాణ్ వైపు మొగ్గు చూపినా బహిరంగంగా బయట పడలేదు. పోసానిపై మాత్రం అందరిలో ఆగ్రహం పెరుగుతోంది. పరిశ్రమలో నటులను ఇలా చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పలువురు పేర్కొంటున్నారు.

పోసాని మొదట ప్రజారాజ్యం, తరువాత టీడీపీ, ఇప్పుడు వైసీపీలో కొనసాగుతున్నారు. రాజకీయ నేతలకు మద్దతుగా మాట్లాడటంపై సినిమా పరిశ్రమ వారిలో ఆగ్రహం వస్తోంది. పోసానిపై నిషేధం విధించాలని ఆలోచిస్తున్నా తరువాత జరిగే పరిణామాలపై భయాందోళన వ్యక్తం చేస్తూ అందుకు సిద్ధం కావడం లేదు. కానీ పోసాని చర్యలపై అందరిలో ఆగ్రహావేశాలు మాత్రం పెరుగుతున్నాయి. నటుల్లో ఐక్యత ఉండాలని చూసినా పోసాని మాటలకు అందరి మనసు నొచ్చుకుంది.
పోసానిని అధికారికంగా బహిష్కరించడం కన్నా అనధికారికంగా అవకాశాలు రాకుండా చేయాలని చూసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. భవిష్యత్ లో ఆయనకు ఎవరు కూడా నటించే అవకాశం ఇవ్వకుండా చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పోసాని వ్యవహారంపై సినీ పెద్దలు పలు నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇకపై పోసానికి చాన్సులు ఇవ్వకుండా కట్టడి చేసేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలకు దిగడంపై అందరిలో ఆశ్చర్యం వేసింది. ఒక నటుడుగా తన స్థాయి మరిచి విమర్శలు చేయడం ఆయనకే చెల్లిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి ఇందులో పోసాని ఒంటరిగా మారిపోయారని చెబుతున్నారు. ఆయనపై నిషేధం కొనసాగింపుకే అందరు ఓటు వేస్తున్నట్లు సమాచారం.