డైలాగ్ కింగ్ మోహన్ బాబు మరోసారి తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఇప్పటికే ‘అలీతో సరదాగా’ షోలో సినిమా విషయాలు బయటపెట్టిన మోహన్ బాబు తాజాగా రాజకీయాలు, మా ఎన్నికలపై ఓపెనప్ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ గురించి.. మా ఎన్నికలపై హాట్ కామెంట్స్ చేశారు.

సీఎం జగన్ విద్యాసంస్థలన్నింటికి ఒకేరకమైన ఫీజులు నిర్ణయించడం కరెక్ట్ కాదని మోహన్ బాబు ఇండైరెక్ట్ గా అభిప్రాయపడ్డారు. దాని వల్ల తన ప్రధాన విద్యాసంస్థలకు జీతాలు ఇవ్వడం కూడా కష్టమైందన్న విషయాన్ని అంగీకరించాడు. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జగన్ ను తప్పుదోవపట్టిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రోడ్డెక్కిన తాను ఇప్పుడు జగన్ ఫీజుల నియంత్రణపై మాట్లాడకపోతున్నానని.. ఎందుకంటే జగన్ సీఎం కావాలని కోరుకున్న వారిలో తాను ఒక్కడిని అని అన్నారు. ఫీజుల నియంత్రణతో ఆర్థికంగా విద్యాసంస్థలు ఇబ్బంది పడుతున్నాయని అన్నారు.
చిరంజీవి కుటుంబం, అల్లు అరవింద్ కుమారులెవరైనా ‘మా’ ఎన్నికల్లో నిలబడి ఉంటే తాను మంచు విష్ణును ఎన్నికల నుంచి విత్ డ్రా అవ్వమని చెప్పేవాడినని.. చిరంజీవి అంటే తనకు గౌరవం అని సీనియర్ నటుడు మోహన్ బాబు అన్నారు.వాళ్లు నాకు బిడ్డలాంటివారే.. చిరంజీవి ఎప్పటికీ తనకు స్నేహితేడేనన్నారు. మా ఎన్నికల కారణంగా మా మధ్య ఎలాంటి దూరం పెరగలేదని స్పష్టం చేశారు. తాజాగా ఎన్నికల్లో మంచు విష్ణు విజయం తథ్యమన్నారు. అధ్యక్షుడై ‘మా’ భవనం కట్టి తీరుతాడని చెప్పుకొచ్చాడు.
ఇక ప్రత్యర్థి ప్రకాష్ రాజ్ తో అసలు తనకేమీ గొడవలు లేవని.. తాను ఎక్కడైనా కనిపిస్తే అన్నాయ్యా బాగున్నారా? అని బాగానే మాట్లాడుతాడని మోహన్ బాబు వివరించారు. మా ఎన్నికల్లో మద్దతు కోరుతూ 800 మంది ఆర్టిస్టులతో ఫోన్ లో మాట్లాడానని వివరించారు.
ఇక సినీ ఇండస్ట్రీలో దాసరి నారాయణరావుతోనే పెద్దరికం పోయిందని.. ఇప్పుడు ఎవరూ సినీ పెద్దలు లేరని స్పష్టం చేశారు. సినిమాలు చేయడం తగ్గించానని.. మంచిపాత్రలు వస్తే చేస్తానని వివరించారు.
ఫుల్ వీడియో