Devara: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి సపరేటు గుర్తింపు అయితే ఉంది. వీళ్లు సాధించిన విజయాలు వీళ్ళు సంపాదించుకున్న అభిమానులను చూస్తే నందమూరి ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ ఏంటో మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇక ఇలాంటి సందర్భంలోనే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా వెలుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటికే అభిమానుల్లో ‘మ్యాన్ ఆఫ్ ది మాసేస్’ గా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న ఎన్టీయార్ ఈనెల 27వ తేదీన రిలీజ్ అవ్వబోతున్న దేవర సినిమాతో మరోసారి భారీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకొని 1000 కోట్ల కలెక్షన్లను తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక దానికోసమే ఆయన తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలు హాజరవ్వబోతున్నారు అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాల మీద స్పష్టత లేదు. కానీ ఈ సినిమా అవుట్ పుట్ మీద ఎన్టీఆర్ మాత్రం అంత సాటిస్ఫైడ్ గా లేడనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది.
కానీ ఈ సినిమాకి భారీగా బిజినెస్ జరగాలనే ఉద్దేశ్యంతో ఆయన భారీగా ప్రమోషన్స్ చేపడుతున్నాడు. నిజానికి ఈ సినిమా మీదనే ఆయన చాలా రోజుల నుంచి చాలా అంచనాలైతే పెట్టుకున్నాడు. కానీ కొరటాల శివ మాత్రం తన అంచనాలకు భిన్నంగా ఈ సినిమాను తీసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. అందువల్లే ఈ సినిమా మీద ఆయన పూర్తిగా సంతృప్తిని చెందడం లేదు అంటూ సోషల్ మీడియాలో కొన్ని కథనాలైతే వెలువడుతున్నాయి.
ఇక ఎన్టీఆర్ ఈ సినిమాని భారీ సక్సెస్ గా నిలుపుతాడా? లేదంటే ఈ సినిమా కూడా ఆవరేజ్ గానే ఆడుతుందా అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇప్పటికే కొరటాల శివ చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నప్పటికీ, ఆయన ఆచార్య సినిమా ప్లాప్ తో ఒక బ్యాడ్ నేమ్ ను అయితే మూటగట్టుకున్నాడు. ఇక ఆ విషయాన్ని అభిమానులు మరోసారి గుర్తు చేసుకుంటూ దేవర సినిమా విషయంలో కూడా అదే జరగబోతుంది అంటూ నెగిటివ్ ప్రచారం చేయడం కూడా ఈ సినిమాకి కొంతవరకు మైనస్ గా మారుతుందనే చెప్పాలి…