Unstoppable Season 4 : ఎన్టీఆర్ తనయుడైన బాలకృష్ణ చైల్డ్ ఆర్టిస్ట్ గా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. తండ్రి ఎన్టీఆర్ తాతమ్మ కల అనే మూవీతో మొదటిసారి బాలకృష్ణను ఆడియన్స్ కి పరిచయం చేశాడు. ఈ మూవీకి ఆయనే దర్శకుడు. బాలకృష్ణ కెరీర్లో నెగిటివ్ రోల్స్ చేసింది లేదు. సుల్తాన్ మూవీలో టెర్రరిస్ట్ గా ఆయన రోల్ నెగిటివ్ షేడ్స్ తో కూడి ఉంటుంది. పూర్తి స్థాయి విలన్ గా మాత్రం ఆయన నటించలేదు. అయితే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మూవీలో మాత్రం విలన్ గా చేస్తాడట.
వివరాల్లోకి వెళితే… అన్ స్టాపబుల్ షో సీజన్ 4 ఇటీవల మొదలైంది. పలువురు ప్రముఖులు ఈ టాక్ షోలో పాల్గొంటున్నారు. తాజాగా శ్రీలీల, నవీన్ పోలిశెట్టి హాజరయ్యారు. నవీన్ పోలిశెట్టిని బాలకృష్ణ ఒక ప్రశ్న అడిగారు. రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ లలో ఒకరితో సినిమా చేయాల్సి వ్ వస్తే ఎవరిని ఎంచుకుంటావని అడిగాడు? ఈ ప్రశ్నకు డిప్లొమాటిక్ గా సమాధానం చెప్పాడు నవీన్. రాజమౌళి గారు మహేష్ బాబుతో ఒక మూవీ చేస్తున్నారు. అది విడుదల కావడానికి మూడేళ్ళ సమయం పడుతుంది. ఇక సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ అన్నతో స్పిరిట్ చేస్తున్నారు. దానికి రెండేళ్ల సమయం పడుతుంది.
సందీప్ రెడ్డి ముందుగా ఫ్రీ అవుతారు కాబట్టి ఆయనతో చేస్తా.. అనంతరం రాజమౌళితో మూవీ చేస్తాను అన్నారు. నేను అయితే.. రాజమౌళి సినిమాలో హీరోగా, సందీప్ రెడ్డి మూవీలో విలన్ గా చేస్తాను అన్నారు. ఈ కామెంట్ మైండ్ బ్లాక్ చేసింది. సందీప్ రెడ్డి చిత్రాల్లో పాత్రలు చాలా వైలెంట్ గా ఉంటాయి. ఇంటెన్సిటీ తో కూడి ఉంటాయి యానిమల్ మూవీలో హీరో రన్బీర్ కపూర్ క్యారెక్టరైజేషన్ వైల్డ్ అనుకుంటే.. అంతకు మించి ఉంటుంది బాబీ డియోల్ రోల్.
యానిమల్ లో బాబీ డియోల్ విలన్ గా చేశాడు. మరి ఆ సినిమా బాలయ్యకు బాగా నచ్చేసిందేమో కానీ.. సందీప్ రెడ్డి చిత్రంలో విలన్ గా చేసేందుకు రెడీ అన్నారు. బాలయ్య సీరియస్ గా ఈ మాట అంటే సందీప్ రెడ్డి స్పిరిట్ మూవీ కొరకు సంప్రదించినా ఆశ్చర్యం లేదు.