Ishq Re Release: ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి కొడుకు గా ఇండస్ట్రీ లోకి ‘జయం’ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసిన నితిన్, ఆ చిత్రంతో సృటించిన రికార్డులు ఆ రోజుల్లో ఎలాంటివో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ఆయన ఆ తర్వాత దిల్, సై వంటి సూపర్ హిట్స్ ని అందుకున్నాడు. వీటి తర్వాత ఆయన ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 12 ఫ్లాప్ సినిమాలను అందుకున్నాడు. కెరీర్ దాదాపుగా షెడ్డుకి వెళ్ళిపోతుంది అని ఆనుకుంటున్న సమయంలో ఈయనకి ‘ఇష్క్’ చిత్రం పడింది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఆరోజుల్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని పాటలు అప్పట్లో సెన్సేషన్ అయ్యాయి. బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించిన ఈ సినిమా, నితిన్ మార్కెట్ ని రక్షించింది.
ఈ చిత్రం తర్వాత మళ్ళీ ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా సూపర్ హిట్స్ వచ్చాయి, మధ్యలో ఫ్లాప్స్ కూడా బాగానే వచ్చాయి కానీ అవి నితిన్ మార్కెట్ ని ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయాయి. ఆయన కెరీర్ కి సంజీవని లాగా నిల్చిన ఈ చిత్రాన్ని నిన్న గ్రాండ్ గా 4K కి మార్చి గ్రాండ్ గా రీ రిలీజ్ చేసారు. ఫలితం ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా 65 కి పైగా హౌస్ ఫుల్ షోస్ పడ్డాయి. వీటి నుండి ఈ చిత్రానికి 70 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఇది సాధారణమైన విషయం కాదు. ఒక్క హైదరాబాద్ సిటీ నుండి 40 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చిందటే ఈ సినిమాకి యూత్ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
నిన్న హైదరాబాద్ లోని ఈ సినిమా మెయిన్ థియేటర్ లో నితిన్ విచ్చేసి, అభిమానుల సమక్ష్యంలో సినిమా చూసి ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇలాంటి లవ్ స్టోరీస్ మరికొన్ని చేయాలనీ, మళ్ళీ ఫామ్ లోకి రావాలని కోరుకుంటున్నారు. నితిన్ ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్నాడు. ఆయన నుండి వచ్చిన గత చిత్రం ‘మాచెర్ల నియోజకవర్గం’ కమర్సియల్ ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత విడుదలైన ‘ఎక్స్ స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ చిత్రం కూడా ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ఆయన ఆశలన్నీ ‘రాబిన్ హుడ్’ చిత్రం మీదనే ఉంది. తనతో ‘భీష్మ’ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ నెల 25 వ తారీఖున ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.