Rajamouli- Allu Arjun : ఆ స్టార్ హీరోతో రాజమౌళి ఎందుకు సినిమా తీయడం లేదు.. కారణం ఇదేనా?

రాజమౌళి గురించి ఓ చర్చ హాట్ టాపిక్ అయింది. ఇప్పటి వరకు తెలుగు సినీ స్టార్లతో సినిమాలు తీసినా.. ఆ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను మాత్రం ఎందుకు ఎంపిక చేసుకోవడం లేదని చర్చ సాగుతోంది.

Written By: Chai Muchhata, Updated On : August 30, 2024 10:20 am

Rajamouli- Allu Arjun

Follow us on

Rajamouli- Allu Arjun :  బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతూ ఉంటుంది. ఆయన తీసినవి తక్కువ సినిమాలే అయినా గ్లోబల్ లెవల్లో జక్కన్నకు గుర్తింపు వచ్చింది. దీంతో రాజమౌళి సినిమాలో ఛాన్స్ కోసం కొందరు ఆరాట పడుతూ ఉంటారు. ఇక ఆయన సినిమాలో హీరోగా నటిస్తే తిరుగు ఉండదని కొందరి ఆశ. ఇప్పటికే నటించిన ప్రభాస్, రామ్ చరణ్, నాని లు స్టార్లుగా మారిపోయారు. మరికొందరు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే రాజమౌళి ప్రతీ సినిమాకు హీరోను కథకు తగిన విధంగా హీరోను సెలెక్ట్ చేసుకుంటారు. కంటెంట్ కు అనుగుణంగా సీనియర్, జూనియర్ తో సంబంధం లేకుండా హీరోలను ఎంచుకుంటారు. అయితే ఇప్పటి వరకు ప్రభాస్, రామ్ చరణ్ లు రెండుసార్లు, ఎన్టీఆర్ మూడు సార్లు నటించారు. కానీ తెలుగు సినిమాలో స్టార్ గా ఉన్న ఓ హీరో మాత్రం నటించలేదు. అందుకు కారణం ఏంటంటే?

రాజమౌళి సినిమా రావడానికి చాలా సమయం పడుతుంది. ప్రతీ మూవీ కనీసం మూడేళ్ల గ్యాప్ తీసుకుంటూ ఉంటుంది. వాస్తవానికి ఇంత సమయం తీసుకోవడానికి ఏ హీరో ఒప్పుకోరు. కానీ మూడేళ్ల తరువాత వచ్చే ఆ సినిమా పదేళ్ల కెరీర్ ను తీసుకొస్తుందని అంటారు. అందుకే స్టార్ హీరోలు ఎన్ని సినిమాలున్నా వాటిని కాదని మరీ జక్కన్న సినిమాలో నటిస్తారు. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని రూ. 1500 కోట్లతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయినట్లు సమాచారం.

ఈ సందర్భంగా రాజమౌళి గురించి ఓ చర్చ హాట్ టాపిక్ అయింది. ఇప్పటి వరకు తెలుగు సినీ స్టార్లతో సినిమాలు తీసినా.. ఆ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను మాత్రం ఎందుకు ఎంపిక చేసుకోవడం లేదని చర్చ సాగుతోంది.అయితే కొన్ని వర్గాల సమాచారం ప్రకారం.. రాజమౌళి తీసిన బ్లాక్ బస్టర్ ‘మగధీర’ గురించి ఎవరూ మరిచిపోరు. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ మూవీ రాజమౌళి కెరీర్ ను తిప్పిందని అనుకోవచ్చు. ఈ మూవీ కి అల్లు అరవింద్ నిర్మాతగా ఉన్నారు. అయితే ఈ సినిమా సమయంలో అల్లు అరవింద్, రాజమౌళి మధ్య కొన్ని విభేదాలు వచ్చాయి. అప్పటి నుంచి రాజమౌళి అల్లు అరవింద్ ను పక్కన బెట్టేశారనే టాక్ వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ కుమారుడు అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా తీయడం లేదని వినిపిస్తోంది. అయితే పవర్ ఫుల్ యాక్టింగ్ చేసే బన్నీ, రాజమౌళి కాంబినేషన్లో సినిమా వస్తే థియేటర్లు బద్దలవుతాయని అంటున్నారు. మరి ఈ విషయంలో రాజమౌళి రెస్పాన్స్ ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా తీస్తున్న తరుణంలో ఈ మూవీ ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేం. దీంతో ఇప్పుడే కొత్త సినిమా అనౌన్స్ చేసే ప్రసక్తే లేదు. అయితే అప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
ac