Junior NTR
Junior NTR: నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు హైదరాబాద్ లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని NTR శత జయంతి కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. నగరంలోని కూకట్ పల్లి కైత్లాపూర్ మైదానంలో మే 20 శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లో ట్రాఫిక్ అంక్షలు కూడా విధించారు. దాదాపు 15 నుంచి 20 వేల మంది వరకు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా వేశారు. అయితే ఈ కార్యక్రమానికి ప్రముఖులకు ఆహ్వానాలను పంపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఎన్టీఆర్ మనువడు జూనియర్ ఎన్టీఆర్ కు కూడా పిలుపు వెళ్లింది.
తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని తెలుస్తోంది. తన 40వ జన్మదినం కూడా ఇదే రోజు కావడంతో ఆయన ఈ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాకుండా కొన్ని కార్యక్రమాలతో జూనియర్ బిజీగా ఉంటారని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని ఆయన ఆహ్వాన కమిటీకి ఎప్పుడో తెలియజేశారని, కానీ ఈ విషయం ముందే చెబితే రాద్దాంతం అవుతుందని బయటకు రానివ్వలేదు. అయితే 20న శుక్రవారం ఎన్టీఆర్ శత జయంతి ఏర్పాట్లు నిర్వహిస్తున్న సమయంలో ఈ విషయం బయటకు రావడంతో అంతా షాక్ అయ్యారు.
ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ తో పాటు పలువురు సినీ ప్రముఖులను కూడా ఆహ్వానం వెళ్లినట్లు సమాచారం. సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటులు, స్టార్ డైరెక్టర్లు, నిర్మాతలతో పాటు పాత్రికేయులను ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన విశేషాలు, ప్రత్యేక సావనీర్ తదితర పూర్తి సమాచారంతో ‘జై ఎన్టీఆర్’ అనే వెబ్ సైట్లో పొందరు పర్చారు. దీనిని ఈ కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు.
ఇదిలా ఉండగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు హైదరాబాద్ లోనేకాకుండా విదేశాల్లోనూ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అప్పటి ఎన్టీఆర్ కు సంబంధించిన వీడియోలు ప్రసారం చేస్తూ సందడి చేస్తున్నారు. తెలుగువారు అత్యధికంగా ఉన్నప్రాంతాల్లో ప్రత్యేక ఈవెంట్లను నిర్వహించి ఆయనను గుర్తు చేసుకుంటున్నారు.