https://oktelugu.com/

Akkineni Akhil : అఖిల్ సినిమాలు ప్లాప్ కావడానికి కారణం ఇదా..? ఇంతకాలం తెలియలేదే?

నాగేశ్వర్ రావు నుంచి నాగ చైతన్య వరకు ప్రతీ పేరులో ‘నాగ’ వచ్చింది. అయితే అఖిల్ విషయానికొచ్చేసరికి మాత్రం నాగ కనిపించదు. కేవలం అఖిల్ అని మాత్రమే ఉంటుంది. అయితే అఖిల్ పేరులో నాగ లేకపోవడం వల్లే ఆయనకు సినీ కష్టాలు వస్తున్నాయని కొందరు అంటున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : May 23, 2023 / 07:09 PM IST
    Follow us on

    Akkineni Akhil : టాలీవుడ్ ఇండస్ట్రీలో వారసులు చాలా మందే ఉన్నారు. కొన్ని కుటుంబాలకు చెందిన మూడు తరాల వారసులు సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. వారిలో అక్కినేని నాగేశ్వర్ రావు కుటుంబం. మొదటితరం లెజెండ్ హీరోల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వర్ రావు చివరి వరకు సినిమాల్లో కొనసాగారు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రత్యేకంగా నిలిచారు. ఆయన కుమారుడు అక్కినేని నాగార్జున సైతం స్టార్ హీరో అయ్యారు. తండ్రి వారసత్వం పుచ్చుకున్నా యువ సామ్రాట్ గా నిలిచారు. అయితే ఆయన కుమారుడు నాగచైతన్య, అఖిల్ లు ప్రస్తుతం స్టార్ ఇమేజ్ కోసం కష్టపడుతున్నారు. వీరిలో అక్కినేని నాగచైతన్య నటించిన కొన్ని సినిమాలు యావరేజ్ హిట్ కొట్టాయి. కానీ అఖిల్ కు ఇప్పటి వరకు ఒక్క హిట్టు రాలేదు. అందుకు ఓ బలమైన కారణం ఉందని సోషల్ మీడియాలో ఓ న్యూస్  సర్క్యూలేట్ అవుతోంది.

    అక్కినేని అఖిల్ చైల్డ్ ఆర్టిస్టుగానే సినీ ఎంట్రీ ఇచ్చాడు. సిసింద్రీ సినిమాలో చిన్న పిల్లాడిలా కనిపించిన అఖిల్ ఆ సమయంలోనే తన నటనతో ఆకట్టుకున్నాడు. దీంతో ఆ కుర్రాడు పెరిగి పెద్దయ్యాక పెద్ద హీరో అవుతారని అందరూ భావించారు. అయితే అఖిల్ పెద్దయ్యాక, తన పేరు మీదే ‘అఖిల్’ సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ మూవీ అంతగా కలిసి రాలేదు. ఆ తదరువాత మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ వంటి సినిమాలను చేశారు. ఇవేవీ సక్సెస్ కాలేదు.

    ఇలాక్కాదని స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో కలిసి భారీ బడ్జెట్ తో మూవీని తీశారు. ఇందుకోసం పాపం అఖిల్ బాగానే కష్టపడ్డారు. రోజూ 16 గంటల వ్యాయామం చేస్తూ బాటీ ఫిట్ నెస్ ను పెంచుకున్నాడు. అయితే సినిమా రిలీజ్ అయిన తరువా రెండు రోజులకే తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఏకంగా సినీ నిర్మాతే మా సినిమా ఫెయిల్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అసలు అఖిల్ సినిమాలకు ఏమైంది? అన్న చర్చ ప్రారంభమైంది. ఇంతలో కొందరు అఖిల్ పేరులోనే సమస్యలున్నాయని కొందరు అంటున్నారు.

    నాగేశ్వర్ రావు నుంచి నాగ చైతన్య వరకు ప్రతీ పేరులో ‘నాగ’ వచ్చింది. అంటే నాగమ్మ దయతో తమ కుటుంబం చల్లగా ఉంటుందని అందుకే నాగ పేరును జోడించినట్లు అక్కినేని కుటుంబ సభ్యులు కొందరు చెప్పారు. అయితే అఖిల్ విషయానికొచ్చేసరికి మాత్రం నాగ కనిపించదు. కేవలం అఖిల్ అని మాత్రమే ఉంటుంది. అయితే అఖిల్ పేరులో నాగ లేకపోవడం వల్లే ఆయనకు సినీ కష్టాలు వస్తున్నాయని కొందరు అంటున్నారు. తన అన్న నాగ చైతన్య పెద్ద స్టార్ కాకపోయినా కొన్ని సినిమాలు అయితే కలిసి వచ్చాయి. కానీ అఖిల్ కు మాత్రం ఒక్కటీ సక్సెస్ కాకపోవడంతో పేరులోనే సమస్య ఉందని కొందరు చర్చించుకుంటున్నారు.