Mirai Vibe Undi Baby Song: ఈమధ్య కాలం లో ఒక సినిమా కి మంచి ఓపెనింగ్ వసూళ్లు రావాలంటే సినిమాలోని పాటలు ఒకటి కాకపోయినా ఒకటి భారీ హిట్ అవ్వాలి. అప్పుడే ఆ సినిమాకు హైప్ ఏర్పడుతుంది. హీరో తో సంబంధం లేకుండా మినిమం గ్యారంటీ ఓపెనింగ్ వసూళ్లు వస్తుంటాయి. నిన్న విడుదలై సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకున్న మిరాయ్(Mirai Movie) చిత్రానికి కూడా విడుదలకు ముందు హైప్ రావడానికి ప్రధాన కారణాలలో ఒకటి ‘వీబీ ఉంది బేబీ'(Vibe Undi Baby) పాట. సినిమా విడుదలకు ముందు ఈ పాట పెద్ద హిట్ అయ్యింది. సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన ఈ పాట ఒక రేంజ్ లో మారుమోగిపోయింది. కేవలం సోషల్ మీడియా లో మాత్రమే కాదు టీవీ షోస్ లో కూడా ఈ పాట ని తెగ వాడేశారు. జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది. అలాంటి పాట నిన్న సినిమాలో ఎక్కడా కనిపించకపోవడం ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు.
థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ ఈ పాట కోసం ఎదురు చూసారు. సన్నివేశాలు గడిచిపోతూనే ఉన్నాయి కానీ ఈ పాట మాత్రం రాలేదు. అలా ఎదురు చూస్తూ వచ్చిన అభిమానులకు క్లైమాక్స్ శుభం కార్డు పడిన తర్వాత కనీసం రోలింగ్ టైటిల్స్ అప్పుడైనా వేస్తారని అనుకున్నారు . కానీ వెయ్యలేదు. మూడు గంటల సినిమాలో ఎక్కడా కూడా పాట కనిపించదు. సినిమా కథ కు ఎందుకో ఆ పాట స్పీడ్ బ్రేకర్ లాగా ఉందని డైరెక్టర్ కి అనిపించిందట. అందుకే ఈ పాటని తొలగించారు. రీసెంట్ గా విడుదలైన కింగ్డమ్ చిత్రం లో కూడా ఒక అద్భుతమైన పాటని ఇలాగే కథకు అడ్డంగా ఉందని తొలగించాల్సి వచ్చిందట. స్వయంగా ఈ విషయాన్నీ ఆ చిత్ర నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు మిరాయ్ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. సినిమా లెంగ్త్ అనిపించినా జనాలు పట్టించుకోరు, మరి సోషల్ మీడియా ని ఒక ఊపు ఊపిన ఈ పాటని రెండు వారాల తర్వాత మళ్లీ సినిమాకు జత చేస్తారో లేదో చూడాలి. ఒకవేళ జత చేస్తే మాత్రం కలెక్షన్స్ మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయి.