Rashmika Rakshit Shetty breakup: సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే హీరో హీరోయిన్లు సైతం సూపర్ సక్సెస్ లను సాధించడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. వాళ్ళు చేసే సినిమాల ద్వారా వాళ్ల క్రేజ్ చాలా వరకు పెరిగిపోతుందనే చెప్పాలి. ఇక ఇలాంటి సందర్భంలోనే నటీనటుల మధ్య మంచి సంబంధాలు ఏర్పడి వాళ్ళ మధ్య స్నేహం చిగురించి, అది కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే నేషనల్ క్రష్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న రష్మిక మందాన సైతం కన్నడ హీరో అయిన రక్షిత్ శెట్టి తో ప్రేమలో పడింది. వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమను పెళ్లిగా మార్చుకోవాలనే ఉద్దేశ్యంతోనే నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ అనుకోని కారణాలవల్ల రష్మిక అతనితో ఎంగేజ్ మెంట్ క్యాన్సల్ చేసుకుంది. కారణం ఏంటి అంటే తన కుటుంబ సభ్యులు, తన బంధువులు ఇచ్చిన సలహా మేరకు ఆమె ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుందట…ఇక తన కెరియర్ ఇప్పుడే స్టార్టింగ్ లో ఉంది కాబట్టి మరికొన్ని సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా అవతరించాలనే ఉద్దేశ్యంతో ఆమె ఉండటం వల్ల తమ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సమయానికి కట్టుబడి ఉన్నారు. మొత్తానికైతే రక్షిత్ శెట్టి తో బ్రేకప్ అయిన తర్వాత తెలుగులోనే విజయ్ దేవరకొండ తో ‘గీతా గోవిందం’ అనే సినిమా చేశారు. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇక అప్పటి నుంచి వీళ్ళ కాంబినేషన్ కి మంచి గుర్తింపు రావడంతో ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమాని కూడా చేశారు. ఇక వీళ్లు ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు. రీసెంట్ గా రహస్యంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఫిబ్రవరి లో పెళ్లి కాబోతుంది అంటూ మరి కొంతమంది కామెంట్ చేస్తున్నప్పటికి సరైన క్లారిటీ రావడం లేదు…
ఇటు విజయ్ గాని, అటు రష్మిక మందాన ఇద్దరిలో ఎవరు కూడా ఈ విషయం మీద స్పందించకపోవడంతో అసలు నిజంగానే వీళ్ళకి ఎంగేజ్మెంట్ అయిందా? పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు అంటూ చాలామంది వాళ్ళ అభిమానులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదంతా చూసిన మరి కొంతమంది రష్మిక ను ఉద్దేశించి ఆమె గతంలో రక్షిత్ శెట్టితో ఎంగేజ్ మెంట్ చేసుకొని ఆ తర్వాత క్యాన్సల్ చేసుకున్నారు.
మరి ఇప్పుడు కూడా విజయ్ దేవరకొండ తో ఎంగేజ్మెంట్ చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండతో అయిన ఆమె పెళ్లి పీటలు ఎక్కుతారా? లేదంటే మరోసారి క్యాన్సిల్ చేసే ప్రయత్నం ఏదైనా జరుగుతుందా? అనే ధోరణిలో కూడా కొన్ని అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి…
నిజానికి రక్షిత్ శెట్టి తో పీకల్లోతూ ప్రేమలో ఉన్న రష్మిక అనుకోకుండా బ్రేకప్ చెప్పడం అనేది అప్పట్లో పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది. పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్లే ఆమె అలాంటి డిసీజన్స్ తీసుకొన్నాను అని చెప్పినప్పటికి విజయ్ విషయంలో ఏం జరగబోతోంది అనేది తెలియాల్సి ఉంది…