Mahesh- Trivikram Movie: ‘సర్కారు వారి పాట’ తరువాత మహేశ్ బాబు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ పట్టాలెక్కెందుకు అనేక అడ్డంకులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథ ఫైనల్ కాకపోవడంతో షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేని పరిస్థితి. ఇప్పటికే ఓ సీన్ తీయడానికి రెడీ కాగా.. కథలో మార్పులు కావాలని యూనిట్ లో కొందరు అడిగారట. దీంతో ఆ షూటింగ్ ను వాయిదా వేశారు. ఇప్పుడొస్తున్న సినిమాలు పాన్ ఇండియా లెవల్లో ఉండడంతో త్రివిక్రమ్ సినిమాను కూడా అదే దృష్టిలో పెట్టుకొని కథను రూపొందించాలన్నారట. కానీ మాటల మాంత్రికుడు మాత్రం అందుకు ససెమిరా అంటున్నట్లు సమాచారం.

త్రివిక్రమ్ సినిమా అనగానే కామెడీకి ప్రిఫరెన్స్ ఉంటుంది. ఆ తరువాత అందమైన లోకేషన్ష్, రిలేషన్ షిప్ కలిగి ఉంటాయి. చాలా వరకు ఆయన సినిమాలన్నీ ఇలాగే కొనసాగుతాయి. అయితే ఇప్పుడన్నీ పాన్ ఇండియా లెవల్లో సినిమాలను చిత్రీకరిస్తున్నారు. మహేశ్ అంతకుముందు సినిమాలన్నీ ఆ లెవల్లోనే కొనసాగాయి. అందువల్ల ఇప్పుడు తీయబోయే సినిమా కూడా అలాగే ఉండాలని త్రివిక్రమ్ పై ఫోర్స్ చేస్తున్నారట. కానీ ఈ క్రేజీ డైరెక్టర్ మాత్రం తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా సినిమా ఉంటుందని అంటున్నాడట.
పాన్ ఇండియా పేరు చెప్పి సినిమా కథ ఇష్టమొచ్చిన రీతిలో కొనసాగిస్తే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయరు.. అన్నరీతిలో సమాధానం ఇచ్చారట. ఈ విషయంపై ఎటూ తేలకపోవడంతో మహేశ్ సినిమా ఆలస్యం అవుతుందని అంటున్నారు. అయితే మహేశ్ త్రివిక్రమ్ తో మూవీ పూర్తయితే రాజమౌళితో చేసేందుకు రెడీ గా ఉన్నారు. ఇప్పుడిది ఆలస్యం అయితే ఆ మూవీ మరింత లేట్ అవుతుంది. దీంతో మహేశ్ కెరీర్ పై మరకపడే అవకాశం ఉంది. అందువల్ల ఏదో ఒకటి తేల్చి సినిమాను మొదలు పెట్టాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

మహేశ్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ఆయన రిటర్న్ అయ్యే వరకు ఏదో ఒకటి తేలకపోతే ఈ సినిమాపై ఇంప్రెస్ తగ్గుతుంది. వరుస హిట్లతో జోరుగా ఉన్న మహేశ్ పై ఫ్యాన్స్ ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. ఒక రకంగా మహేశ్ కెరీర్ మలుపు తిప్పడంలో త్రివిక్రమ్ ‘అతడు’ ఎంతో ఉపయోగపడింది. ఇప్పుడు కూడా మంచి కథే ఉండి ఉంటుందని అనుకుంటున్నారు.కానీ పాన్ ఇండియా లెవల్లో కథను మార్చాలని అనేసరికి త్రివిక్రమ్ ఒప్పుకోవడం లేదని సమాచారం. మరి చివరికి త్రివిక్రమ్ ఏం చేసి సినిమాను మొదలు పెడుతాడో చూడాలి.