Sai Pallavi On Chandramukhi 2: చంద్రముఖి దాదాపు 20 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ఇప్పటికి టీవీ లో వస్తుంటే చూసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. హర్రర్ సినిమాలకు ఒక ట్రెండ్ సెట్టర్ ఈ సినిమా. ఇందులో చంద్రముఖి గా నటించిన జ్యోతిక నటన సినిమాకు హైలైట్. సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి స్టార్ హీరో ఉన్నప్పటికీ కూడా ఎక్కువ పేరు జ్యోతికకు వచ్చిందంటే దానికి కారణం చంద్రముఖి పాత్ర.
తాజాగా చంద్రముఖి 2 అంటూ పి .వాసు మరో సినిమాను తెరకెక్కించాడు. రాఘవ లారెన్స్ మరియు కంగనా రనౌత్ కలిసి నటించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో చంద్రముఖి గా కంగనా నటిస్తుంది. నిజానికి ఈ పాత్ర కోసం ప్రముఖ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ని అనుకున్నారని తెలుస్తుంది. కానీ సాయి పల్లవి ఈ పాత్ర చేయడానికి ఒప్పుకోకపోవడంతో కంగనా కు అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది.
సాయిపల్లవి ఒక సినిమాలో నటించాలి అంటే స్టోరీ నచ్చాలి. అందులో ఆమె పాత్ర నచ్చాలి. కథకు, ఆ పాత్రకు తాను న్యాయం చేయగలదు అనుకుంటేనే ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. లేకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో అయిన నిర్మొహమాటంగా నో చెప్పేస్తుంది. ఈ రకంగా సాయి పల్లవి చేసిన సినిమాల కంటే నో చెప్పిన సినిమాలే ఎక్కువ. రీసెంట్ గా వచ్చిన భోళా శంకర్ సినిమాలో చిరంజీవి చెల్లెలు గా నటించే అవకాశం వచ్చినా కానీ అంగీకరించలేదు సాయి పల్లవి.
నిజానికి చంద్రముఖి పాత్రకు సినిమా లో స్కోప్ ఎక్కువగానే ఉంటుంది. పైగా ఆమె నర్తకి కావడంతో సాయిపల్లవి అయితేనే కరెక్ట్ అని భావించి దర్శకుడు పి. వాసు ఆమెను కానీ స్టోరీ వినిపించాడు. స్టోరీ విన్న సాయిపల్లవి చంద్రముఖి పాత్ర చేయడానికి అంగీకరించకపోవడంతో సెకండ్ ఆప్షన్ గా ఉన్న కంగనా ను ఫైనల్ తెలుస్తుంది. సాయిపల్లవి కనుక ఈ సినిమా చేయడానికి ఒప్పుకొని ఉంటే చంద్రముఖి 2 ఖచ్చితంగా మరో లెవెల్ కి వెళ్ళేది. ఇప్పటివరకు వచ్చిన చంద్రముఖి 2 కంటెంట్ గమనిస్తే చంద్రముఖి గా కంగనా బాగానే నటించినట్లు తెలుస్తుంది. ఈ నెల 19న విడుదల కాబోతుంది ఈ సినిమా.