https://oktelugu.com/

Bigg Boss : బిగ్ బాస్’ అభిమానులకు చేదు వార్త..’సీజన్ 8′ ప్రభావం..ఇక నుండి అది లేనట్టేనా?

సీజన్ 6 తర్వాత ఒక ఓటీటీ వెర్షన్ ని చేయగా, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సీజన్ టైటిల్ విన్నర్ గా బిందు మాధవి నిల్చింది. రెండవ సీజన్ గత ఏడాది మొదలు అవుతుందని అనుకున్నారు. పెద్ద ఎత్తున ప్లానింగ్స్ కూడా చేసుకున్నారు. కానీ ఎందుకో చివరి నిమిషం లో ఆ ప్లాన్స్ ని రద్దు చేసుకున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : December 17, 2024 / 08:44 PM IST

    Second season of Bigg Boss OTT

    Follow us on

    Bigg Boss :  మొన్న ఆదివారం తో బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే తో ముగిసింది. ఎంతైనా ఈ షో కి బాగా అలవాటు పడిన ఆడియన్స్ కి, ముగింపు సమయంలో చాలా బాదేస్తాది. ఎందుకంటే ఇన్ని రోజులు సందడి చేసిన ఈ రియాలిటీ షో కోసం మళ్ళీ వచ్చే ఏడాది సెప్టెంబర్ నెల వరకు ఆగాల్సిందేనా అని బాధ పడుతుంటారు. అయితే ఈ సీజన్ అయిపోయిన వెంటనే డిస్నీ + హాట్ స్టార్ లో ఓటీటీ రెండవ సీజన్ మొదలు అవుతుందని ఆశపడ్డారు అభిమానులు. సీజన్ 6 తర్వాత ఒక ఓటీటీ వెర్షన్ ని చేయగా, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సీజన్ టైటిల్ విన్నర్ గా బిందు మాధవి నిల్చింది. రెండవ సీజన్ గత ఏడాది మొదలు అవుతుందని అనుకున్నారు. పెద్ద ఎత్తున ప్లానింగ్స్ కూడా చేసుకున్నారు. కానీ ఎందుకో చివరి నిమిషం లో ఆ ప్లాన్స్ ని రద్దు చేసుకున్నారు.

    అయితే గత కొద్దిరోజులుగా ఈసారి మాత్రం రెండవ సీజన్ కచ్చితంగా ఉంటుందని, జనవరి నెల నుండి మొదలు అవుతుందని వార్తలు వినిపించాయి. అందుకు తగ్గట్టు చర్చలు కూడా జరిపిందట బిగ్ బాస్ టీం. కానీ బడ్జెట్ అనుకూలించకపోవడంతో ఆ ఆలోచనని విరమించుకున్నారట. నేరుగా ఇక బిగ్ బాస్ సీజన్ 9 వరకు ఎదురు చూడాల్సిందే. రెండవ సీజన్ ని ఈసారి కచ్చితంగా ప్లాన్ చెయ్యాలనే ఆలోచన, సీజన్ 8 ప్రారంభం లోనే మేకర్స్ కి ఉన్నిందట. కానీ ఈ సీజన్ 8 అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదట. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ కారణంగా ఎదో చావు తప్పి కన్ను లొట్టబోయింది అన్న విధంగా ఈ సీజన్ టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయట. నష్టాలు కూడా ఈ సీజన్ కి భారీగానే వచ్చిందట. అందుకే చివరి మూడు వారాలు టైమింగ్స్ ని కూడా మార్చాల్సిన పరిస్థితి వచ్చింది.

    గత సీజన్ లో టీఆర్ఫీ రేటింగ్స్ ఈ షో కి ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉండేదట. మామూలు వీక్ డేస్ ఎపిసోడ్స్ కి 8 నుండి 9 టీఆర్ఫీ రేటింగ్స్ వస్తే, వీకెండ్ ఎపిసోడ్ కి 14 నుండి 15 టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చేవట. కానీ ఈ సీజన్ లో ప్రారంభం ఎపిసోడ్స్ కి మంచి టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చినా, 5 వ వారం నుండి రేటింగ్స్ అమాంతం పడిపోయాయట. పాతాళ లోకంలోకి వెళ్ళిపోతున్న సమయంలో వైల్డ్ కార్డ్స్ ఈ సీజన్ ని తమ భుజాల మీద వేసుకొని కాపాడారు. అందుకే పెద్దగా లాభాలు రాని సీజన్ తర్వాత, వెంటనే మరో సీజన్ ని ఆవేశం లో ప్రారంభిస్తే ఇంకా ఎక్కువ నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఓటీటీ రెండవ సీజన్ ని ప్రారంభించే ఆలోచనను పక్కన పెట్టేశారట మేకర్స్. భవిష్యత్తులో కూడా ఓటీటీ వెర్షన్ ఇక ఉండకపోవచ్చు.