Avatar 3: హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపైతే ఉంటుంది. అవతార్ మొదటి పార్ట్ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో మనందరికి తెలిసిందే. మొదటి పార్ట్ తో సూపర్ సక్సెస్ ని సాధించడంతో రెండో పార్ట్ మీద ప్రేక్షకులందరికి విపరీతమైన అంచనాలైతే ఉండేవి. గత రెండు సంవత్సరాల కిందట రిలీజ్ అయిన ‘అవతార్ 2’ సినిమా ఆశించిన మేరకు ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. కారణం ఏంటి అంటే అవతార్ మొదటి పార్ట్ లో ఉన్న కంటెంట్ రెండో పార్ట్ లో కనిపించలేదు.
Also Read: స్టార్ క్రికెటర్ తో డేటింగ్ పై మొదటిసారి స్పందించిన మృణాల్ ఠాకూర్!
జేమ్స్ కాకామెరూన్ సైతం చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమాని తెరకెక్కించినప్పటికి అది ప్రేక్షకుల్లో ఏమాత్రం ఇంపాక్ట్ ను క్రియేట్ చేయలేకపోయింది. ఇక డిసెంబర్ 25వ తేదీన ‘అవతార్ 3’ సినిమా వస్తున్న నేపథ్యంలో ప్రపంచం మొత్తం ఈ సినిమా కోసం ఆసక్తి ఎదురు చూస్తోంది.
ఇప్పటికే ఈ సినిమాకి పోటీగా ఏ సినిమాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డిసెంబర్ 25వ తేదీన ప్రేక్షకులందరిని ఈ సినిమాతో మంత్రముగ్ధుల్ని చేస్తుందనే కాన్ఫిడెంట్ తో కామెరూన్ ఉన్నాడు. ఇక ఇలాంటి క్రమం లోనే ఇండియాలో సైతం జేమ్స్ కామెరూన్ పర్యటించి ఈ సినిమా మీద భారీగా ప్రమోషన్స్ చేయాలని మొదట అనుకున్నప్పటికి ఆ తర్వాత ఇండియాలో ప్రమోషన్స్ చేయడం వల్ల కూడా ఈ సినిమాకి కలెక్షన్స్ పెద్దగా పెరిగే అవకాశం లేదని జేమ్స్ కామెరున్ సైలెంట్ అయిపోయారట.
తెలుగులో ఈ సినిమా మీద పెద్దగా బజ్ లేనట్టుగా అనిపిస్తోంది. దానికి కారణం సెకండ్ పార్ట్ ఆడకపోవడమే ఇక బాలీవుడ్ లో ఈ సినిమా గురించి పెద్దగా ఎవరు పట్టించుకోవడం లేదు… ఇక ఈ సినిమా డిసెంబర్ 25 వ తేదీన రిలీజ్ అవుతోంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభంజనాన్ని క్రియేట్ చేస్తోంది. సక్సెస్ ఫుల్ టాక్ ను తెచ్చుకొని మొదటి పార్ట్ కంటే కూడా భారీ విజయాన్ని నమోదు చేసుకుంటుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…