https://oktelugu.com/

Kangana: ఈ దాడితో నైనా ‘కంగనా’లో మార్పు వస్తోందా

Kangana: హీరోయిన్ లందు కంగనా రనౌత్ వేరయా అన్నట్టు ఉంటుంది ఆమె వ్యవహార శైలి. తనకు సంబంధం లేకపోయినా ఏదొక అంశం పై అడ్డమైన కామెంట్లు చేయడం ఈ బాలీవుడ్‌ బోల్డ్ హీరోయిన్‌ కి బాగా అలవాటు అయిపోయింది. నిత్యం ట్రోలింగ్ అవుతున్నా ఏమి పట్టించుకోదు. ఇక కేసులు పెట్టినా.. ఆమె ఇంటి ముందు గొడవలకు దిగినా అసలు వెనక్కి తగ్గదు. బీజేపీ అండ ఉండటంతో కంగనా రనౌత్ తన ఇష్టానుసారం రెచ్చిపోతూ ముందుకు పోతుంది. ఈ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 4, 2021 / 05:05 PM IST
    Follow us on

    Kangana: హీరోయిన్ లందు కంగనా రనౌత్ వేరయా అన్నట్టు ఉంటుంది ఆమె వ్యవహార శైలి. తనకు సంబంధం లేకపోయినా ఏదొక అంశం పై అడ్డమైన కామెంట్లు చేయడం ఈ బాలీవుడ్‌ బోల్డ్ హీరోయిన్‌ కి బాగా అలవాటు అయిపోయింది. నిత్యం ట్రోలింగ్ అవుతున్నా ఏమి పట్టించుకోదు. ఇక కేసులు పెట్టినా.. ఆమె ఇంటి ముందు గొడవలకు దిగినా అసలు వెనక్కి తగ్గదు.

    Kangana Ranaut

    బీజేపీ అండ ఉండటంతో కంగనా రనౌత్ తన ఇష్టానుసారం రెచ్చిపోతూ ముందుకు పోతుంది. ఈ క్రమంలోనే కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల పై కంగనా విమర్శలు చేసింది. రైతులకు కంగనాకి అసలు సంబంధం ఏమిటి ? ఏమి లేదు. పైగా వ్యవసాయం ఎలా చేస్తారో కూడా ఆమెకు తెలియదు.

    మరి ఎందుకు రైతుల పై విమర్శలు చేసింది అంటే.. మోడీనే కారణం. కంగనా పూర్తి స్థాయిలో మోడీ ప్రభుత్వంకు బాసటగా నిలుస్తోంది. ముఖ్యంగా మోడీ తీసుకు వచ్చిన చట్టాలకు ఆమె తన సంపూర్ణ మద్దతును తెలుపుతుంది. అందుకే పలు సందర్బాల్లో రైతులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ కంగనా రెచ్చిపోయింది. అయితే, కంగనా కామెంట్లును తట్టుకోలేక చంపేస్తామంటూ రైతులు బెదిరింపులకు పాల్పడ్డారు.

    Also Read: మోస్ట్ సెర్చ్డ్ ఫిమేల్ సెలబ్రిటీగా సమంత … టాప్ 10 లిస్ట్ చోటు కైవసం

    ‘నన్నే బెదిరిస్తారా’ అంటూ కంగనా వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొత్తానికి రైతులకు – కంగనాకు మధ్య గట్టిగానే వార్ నడిచింది. అయితే, ఈ వార్ కంగనా వదిలేసింది. మళ్ళీ ఎప్పటిలాగే తన సినిమాలు ఏవో తానూ చేసుకుంటూ ముందుకు పోతుంది. అయితే, తాజాగా కంగనా పంజాబ్‌ కు వెళ్ళింది. ఆమె పంజాబ్ కి వస్తోంది అని తెలుసుకున్న అక్కడి రైతులు అనూహ్యంగా కంగనాను అడ్డగించారు.

    కంగనా కారును ఆపి బూతులు తిడుతూ.. తమ పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని ఆమెను ఒత్తిడి చేశారు. కొంతమంది అయితే కంగనా పై దాడికి కూడా సిద్ధం అయ్యాయరట. మొత్తానికి కంగనా వాళ్ళను చూసి భయాందోళనకు గురైంది. ఎలాగోలా పోలీసులు సహాయంతో అక్కడి నుంచి తప్పించుకుంది. మరి ఈ దాడితో నైనా కంగనాలో మార్పు వస్తోందా ? చూడాలి.

    Also Read: ధోనీతో బ్రేకప్​పై నటి లక్ష్మీ రాయ్​ ఆసక్తికర వ్యాఖ్యలు

    Tags