Trivikram And Sunil: త్రివిక్రమ్, సునీల్ పెళ్లిళ్ల వెనుక ఇంత కథ నడిచిందా? వైరల్ అవుతోన్న పెళ్లి ఫొటోలు

సునీల్ 1974 ఫిబ్రవరి 28న భీమవరంలో జన్మించారు. చదువు పూర్తి చేసుకున్న తరువాత మొట్టమొదటిసారిగా పవన్ కల్యాణ్ మూవీ ‘అక్కడ అబ్బాయి.. ఇక్కడ అమ్మాయి’ సినిమా కోసం పనిచేశాడు.

Written By: Chai Muchhata, Updated On : September 14, 2023 2:44 pm

Trivikram And Sunil

Follow us on

Trivikram And Sunil: సినీ ఇండస్ట్రీలో కొన్ని విషయాలు ఆసక్తిని కలిగిస్తాయి. సినిమాల్లోకి రాకముందు ఉన్న కొందరు స్నేహితులు ఫీల్డులోకి వచ్చాక కూడా అలాగే తమ స్నేహ బంధాన్ని కొనసాగిస్తారు. అలా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉంటారు. సినీ పరిశ్రమలోకి రాకముందు ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్, ప్రముఖ నటుడు సునీల్ లు స్నేహితులు అన్న విషయం కొంత మందికి తెలుసు. అలాగే వీరు కలిసి చదువుకున్నారని ఆమధ్య బయటపట్టారు కొందరు. అయితే వీరు ఒకేసారి ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే త్రివిక్రమ్ సినిమాలకు రచయితగా మారగా.. సునీల్ కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ తరువాత ఎవరి జీవితాన్ని వారు సక్సెస్ చేసుకున్నారు. అయితే వీరి పెళ్లిళ్ల వెనుక ఓ సీక్రెట్ దాగి ఉంది. అదేంటో తెలుసా?

Trivikram suneel

సునీల్ 1974 ఫిబ్రవరి 28న భీమవరంలో జన్మించారు. చదువు పూర్తి చేసుకున్న తరువాత మొట్టమొదటిసారిగా పవన్ కల్యాణ్ మూవీ ‘అక్కడ అబ్బాయి.. ఇక్కడ అమ్మాయి’ సినిమా కోసం పనిచేశాడు. కానీ ఆయన సీన్స్ కొన్ని కారణాల వల్ల తీసేయాల్సి వచ్చింది. అయతే తేజ డైరెక్ష్లో వచ్చిన ‘నువ్వు నేను’ సినిమాతో ఫేమస్ అయ్యాడు. అప్పటి నుంచి కమెడియన్ గా పలు చిత్రాల్లో నటించారు. ఆ తరువాత ‘అందాల రాముడు’ సినిమాతో హీరోగా మారాడు. అయితే ఆ తరువాత అతనికి అవకాశాలు రాలేదు. దీంతో నటుడిగా మారి వివిధ పాత్రలు చేస్తున్నాడు. ‘పుష్ప’లో సునీల్ విలన్ పాత్ర వేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు అదే ‘పుష్ప 2’లో కంటిన్యూ చేయనున్నాడు.

మాటల రచయితగా ఫీల్డులోకి ఎంట్రీ ఇచ్చిన త్రివిక్రమ్ ‘నువ్వునాకు నచ్చావ్’ సినిమాతో అందరికీ పరిచయం అయ్యాడు. ఆ తరువాత తరుణ్ తో కలిసి ‘నువ్వేనువ్వే’ సినిమాకు మొదటి సారిగా డైరెక్షన్ చేశారు. ఆ తరువాత ఆయన స్టార్ హీరోలతో సక్సెస్ సినిమాలను తీశాడు. పవన్ కల్యాణ్ తో ఎక్కువ సినిమాలు తీసిన ఆయన తన సినిమాల్లో డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి ‘గుంటూరు కారం’ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే.

సునీల్, త్రివిక్రమ్ ల స్నేహ బంధం సినిమా ఫీల్డులోకి రాకముందే కొనసాగింది. సినిమాల్లోకి వచ్చాక కంటిన్యూ అయింది. చాలా వరకు త్రివిక్రమ్ సినిమాల్లో సునీల్ తప్పనిసరిగా ఉంటాడు. త్రివిక్రమ్ మొదటి డైరెక్షన్ సినిమా ‘నువ్వే నువ్వే’లో హీరోతో సమానంగా ఆయన పాత్ర ఉంటుంది. అయితే వీరిద్దరు ఒకే ఊరు.. ఒకే ఫీల్డు మాత్రమే కాదు.. ఒకే రోజు పెళ్లి కూడా చేసుకున్నారు. కేవలం గంటల వ్యవధిలో మాత్రమే పెళ్లిళ్లి చేసుకున్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సౌజన్య ను 2002 అక్టోబర్ 11న పెళ్లి చేసుకున్నారు. దివంగత సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుడు రామశాస్త్రి కుమార్తె సౌజన్య. అలా వీరి మధ్య బంధం ఉండేది. వీరి వివాహం హైదరాబాద్ లోని శ్రీనగర్ లో జరిగింది. ఇక సునీల్ వివాహం కూడా ఇదే రోజు జరిగింది. అక్టోబర్ 11న సాయంత్ర 7 గంటలకు శృతి అనే అమ్మాయితో జరిగింది. వీరి వివాహం శిల్పారామంలో జరిగింది. ఇద్దరి పెళ్లిళ్లకు సినీ ప్రముఖులు వచ్చారు. అయితే స్నేహ బంధం ఉన్న వీరు ఒకరి పెళ్లి మరొకరు చూసుకోలేకపోయారు. అయితే వీరి పెళ్లిళ్ల కు సంబంధించిన న్యూస్ కొన్ని పేపర్లలో వచ్చింది. ఆ పేపర్ల కట్టింగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.